యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఓవర్ నైట్ లో స్టార్ అయ్యారని చాలామంది ప్రేక్షకులు భావిస్తారు. కానీ విజయ్ ఆ గుర్తింపును సంపాదించుకోవడం వెనుక ఎంతో కష్టం ఉంది. అర్జున్ రెడ్డి సినిమాతో యూత్ ఐకాన్ గా గుర్తింపును సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ స్వస్థలం తుమ్మన్ పేట. విజయ్ తండ్రి గోవర్ధన్ రావు నటనపై ఉన్న ఆసక్తితో సొంతూరిని వదిలేసి హైదరాబాద్ కు వచ్చారు. హీరో అవకాశాల కోసం ప్రయత్నించినా ఆయన సక్సెస్ కాలేకపోయారు.
హీరోగా అవకాశాలు రాకపోవడంతో గోవర్ధన్ రావ్ చివరకు టీవీ డైరెక్టర్ గా మారారు. నటుడవ్వాలనే కోరిక బలంగా ఉండటంతో కొడుకు విజయ్ దేవరకొండ నటనపై దృష్టి పెట్టినా గోవర్ధన్ రావ్ ఏం అనలేదు. అయితే విజయ్ మాత్రం చదువు పూర్తైన తరువాత సినిమాల్లోకి వెళ్లాలని అనుకున్నారు. ఎన్నో ప్రయత్నాలు చేసిన తరువాత విజయ్ తన కలను నిజం చేసుకున్నారు. గోవర్ధన్ రావు విజయ్ ను ఒక యాక్టింగ్ స్కూల్ లో చేర్పించి నటనలో శిక్షణ ఇప్పించారు.
నువ్విలా, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాల్లో విజయ్ దేవరకొండ చిన్నపాత్రల్లో నటించారు. అయితే ఎవడే సుబ్రమణ్యం సినిమాలోని రిషి పాత్ర విజయ్ దేవరకొండకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తరువాత పెళ్లిచూపులు, గీతా గోవిందం, అర్జున్ రెడ్డి సినిమాల్లో నటించి స్టార్ హీరో స్థాయికి విజయ్ ఎదిగారు. అల్లు అర్జున్, శర్వానంద్ రిజెక్ట్ చేసిన అర్జున్ రెడ్డి సినిమాలో నటించి విజయ్ దేవరకొండ మెప్పించారు.
రిజల్ట్ తో సంబంధం లేకుండా సినిమాసినిమాకు విజయ్ దేవరకొండ క్రేజ్ ను పెంచుంటుకున్నారు. విజయ్ కు పుస్తకాలు చదవడమంటే ఎంతో ఇష్టం. సినిమాల ద్వారా స్టార్ హీరో స్థాయికి ఎదిగి విజయ్ తండ్రి కలను నిజం చేశారు. తాను తెరవెనుక సినీ కష్టాలన్నీ పడ్డానని ఆ కష్టం వల్లే ఇంత పేరు, ఇంతమంది అభిమానులను సంపాదించుకున్నానని విజయ్ తెలిపారు.