నటించిన సినిమాలు తక్కువే అయినా యూత్ లో విజయ్ దేవరకొండకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు. అర్జున్ రెడ్డి, గీతా గోవిందం సినిమాలు విజయ్ దేవరకొండ క్రేజ్ ను అమాంతం పెంచేశాయి. ప్రస్తుతం లైగర్ పేరుతో పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న విజయ్ దేవరకొండ ఈ సినిమా హిట్టైతే పాన్ ఇండియా హీరోగా గుర్తింపును సంపాదించుకోవడంతో పాటు మార్కెట్ ను పెంచుకునే అవకాశం ఉంది.
స్టైల్ కు ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చే విజయ్ దేవరకొండ హైదరాబాద్ టైమ్స్ ప్రకటించిన మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ 30 జాబితాలో ఏకంగా మొదటి స్థానాన్ని సొంతం చేసుకున్నారు. వరుసగా మూడేళ్ల నుంచి విజయ్ దేవరకొండ మొదటి స్థానాన్ని సొంతం చేసుకుంటూ ఉండటం గమనార్హం. రెండో స్థానంలో హీరో రామ్ పోతినేని నిలవగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మూడో స్థానంలో ఉన్నారు. స్టార్ హీరో రామ్ చరణ్ నాలుగో స్థానంలో నిలవగా యంగ్ హీరో నాగశౌర్య ఐదో స్థానాన్ని దక్కించుకోవడం గమనార్హం.
మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ జాబితాలో అల్లు అర్జున్ కు 16వ స్థానం దక్కగా కొందరు స్టార్ హీరోలకు ఈ జాబితాలో చోటు దక్కలేదు. 2019 సంవత్సరం జాబితాలో ఎన్టీఆర్ 19వ స్థానానికి పరిమితం కాగా తాజా జాబితాలో మూడో స్థానం సంపాదించుకోవడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. నాగశౌర్య 5వ స్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యపోయేలా చేయడం గమనార్హం. పాపులారిటీ పరంగా అందరి దృష్టిని ఆకర్షించిన నాగశౌర్య లక్ష్య, వరుడు కావలెను సినిమాల్లో నటిస్తున్నారు.