Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ది రాజాసాబ్ రివ్యూ
  • #రాజాసాబ్ కి అన్యాయం జరుగుతుందా?
  • #థియేటర్లలో దోపిడీ.. రంగంలోకి మెగాస్టార్ చిరంజీవి!

Filmy Focus » Featured Stories » “రాయుడు” రివ్యూ & రేటింగ్

“రాయుడు” రివ్యూ & రేటింగ్

  • May 27, 2016 / 09:23 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

“రాయుడు” రివ్యూ & రేటింగ్

మాస్ హీరోగా మంచి ఇమేజ్ ఉన్నప్పటికీ.. “ఇంద్రుడు, జయసూర్య, కథకళి” వంటి ప్రయోగాత్మక చిత్రాల్లో నటిస్తూ-నిర్మిస్తూ వరుస విజయాలు దక్కించుకొన్నాడు. మరోమారు తనకున్న మాస్ ఇమేజ్ ను బేస్ చేసుకొని.. విశాల్ టైటిల్ పాత్రలో నటించి-నిర్మించిన చిత్రం “రాయుడు”. ముత్తయ్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మాస్ మసాలా ఎంటర్ టైనర్ లో విశాల్ సరసన తెలుగమ్మాయి శ్రీదివ్య కథానాయకిగా నటించింది.

ఈ శుక్రవారం మన ముందుకు వచ్చిన “రాయుడు” ఏమేరకు ఆకట్టుకొన్నాడు? అసలు “రాయుడు” కథేంటో చూద్దాం..!!

కథ : రాయుడు (విశాల్) ఓ మార్కెట్ కూలీ. చిన్నప్పుడే తల్లిదండ్రులు మరణించడంతో.. తన అమ్మమ మంగమ్మ (లీలా) దగ్గర పెరుగుతాడు. మనిషి మొరటోడైనప్పటికీ.. అమ్మమ్మ పెంపకం కారణంగా ఆడవాళ్ళంటే అమితమైన గౌరమ్, పెద్దలంటే అభిమానం మాత్రం అబ్బుతాయి.

భాగ్యలక్ష్మి (శ్రీదివ్య) అదే మార్కెట్ పరిధిలో నివాసం ఉంటుంది. అదే ఏరియా కౌన్సిలర్ అయిన రోలెక్స్ బాచి (ఆర్.కె.సురేష్) కారణంగా తన తల్లి హత్యకు కాబడింది అని తన తండ్రితో కలిసి కోర్టులో కేసు వేస్తుంది.

తనకు వ్యతిరేకంగా కేసు వేశారన్న కోపంతో.. భాగ్యలక్ష్మి కుటుంబాన్ని అంతమోందించాలనుకొంటారు రోలెక్స్ అండ్ గ్యాంగ్. రోలెక్స్ బాచి నుంచి భాగ్యలక్ష్మిని కాపాడతాడు రాయుడు.

ఆ తర్వాత రాయుడు ఎదుర్కొన్నా సమస్యలేమిటి? వీరిద్దరి మధ్య రేగిన పంతంలో చివరికి గెలుపు ఎవరిది అనేది సినిమా కథాంశం..!!

నటీనటుల పనితీరు : రాయుడు అనే రోజు కూలీ పాత్రలో విశాల్ ఆహార్యం మొదలుకొని మేనరిజమ్స్ వరకూ అద్భుతంగా పండించాడు. ముఖ్యంగా.. లుంగీ మడతపెట్టి కట్టే సీన్స్ లో విశాల్ పలికించే హావభావాలు మాస్ ఆడియన్స్ కు విపరీతంగా నచ్చుతాయి.

భాగ్యలక్ష్మి పాత్రలో శ్రీదివ్య ధీరవనితగా చక్కగా నటించినప్పటికీ.. చాలా కీలక సన్నివేశాల్లో నీరసంగా కనిపిస్తుంది. రోలెక్స్ బాచిగా నటించిన “ఆర్.కె.సురేష్” విలనిజాన్ని పండించిన తీరు అభినందనీయం. ఒక కరడుగట్టిన హంతకుడిగా అతడు పలికించిన హావభావాలు సినిమాకి హైలైట్ గా నిలుస్తాయి.

విశాల్ కు అమ్మమ్మగా నటించిన మలయాళ నటి లీలా.. సెంటిమెంట్ మరియు కామెడీ టైమింగ్స్ తో అలరించింది. సూరి కామెడీ టైమింగ్ అన్నీ చోట్ల పేలకపోయినప్పటికీ.. విశాల్ శోభనం ఎలా జరిగిందో తెలుసుకోవడం కోసం.. అమ్మమ్మతో కలిసి సూరి ఇంటికి వచ్చే సీన్ ప్రేక్షకులను బాగా నవ్విస్తుంది.

రాధారవి తదితరులు తమ తమ పాత్రల పరిధి మేరకు ఫర్వాలేదనిపించుకొన్నారు.

సాంకేతికవర్గం పనితీరు : ఇమ్మామ్ సమకూర్చిన బాణీల్లో తమిళ వాసన దట్టంగా కొడుతుంది. ఆ కారణంగా తెలుగువారికి పెద్దగా నచ్చకపోవచ్చు. కానీ.. నేపధ్య సంగీతం మాత్రం అడగొట్టేశాడు. ముఖ్యంగా.. పోరాట సన్నివేశాలకు అందించిన ఆర్.ఆర్ సినిమాకు హైలైట్ గా నిలుస్తుంది.

వేల్ రాజ్ ఛాయాగ్రహణం సినిమాకు మాస్ ఫీల్ ను తీసుకువచ్చింది. క్లైమ్యాక్స్ ఫైట్ లో ఎర్ర మట్టిలో హీరో మరియు విలన్ గ్యాంగ్ పోరాడే సన్నివేశానికి “బ్రౌన్ టింట్”ను వాడి సదరు సీన్ కు మంచి ఇంపాక్ట్ ను తీసుకువచ్చాడు.

ప్రవీణ్ ఎడిటింగ్ బాగుంది. సన్నివేశానికి మరో సన్నివేశంతో కలపడానికి వాడీన “స్లైడింగ్” ఎఫెక్ట్ బాగుంది. అనల్ అరసు కంపోజ్ చేసిన ఫైట్స్ మాస్ ఆడియన్స్ కు బాగా నచ్చుతాయి. అయితే.. ఇంటెర్వెల్ బ్యాంగ్ ఫైట్ మాత్రం మరీ అతిశయోక్తి అనిపించకమానదు. క్లైమాక్స్ ఫైట్ మాత్రం చాలా సహజంగా చిత్రీకరించాడు.

శశాంక్ వెన్నెలకంటి సమకూర్చిన సంభాషణలు తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా ఉన్నాయి. ముఖ్యంగా.. అనంతపురం మాండలికంలో వ్రాసిన సంభాషణలు అక్కడి ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకొంటాయి. డబ్బింగ్ కూడా చాలా బాగా కుదిరింది. ఎక్కడా లిప్ సింక్ మిస్ అవ్వకపోవడం విశేషం.

కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : ముత్తయ్య తీసిన మూడో సినిమా “రాయుడు”. ఆయన మునుపటి చిత్రాల వలే ఈ సినిమాలోనూ తమిళ నేటివిటీ ఆడీయన్స్ ను ఆకట్టుకుంటుంది. ఆయన రాసుకొన్న కథ చాలా చిన్నది. ఆ కథను నడిపించిన కథనం మాత్రం అంత ఆసక్తికరంగా ఉండదు. ముఖ్యంగా.. కథలో కీలక మలుపులను సరిగా డీల్ చేయలేకపోయాడు.

హీరోయిన్ తల్లి హత్యను హీరోకు లింక్ చేయడంలోనే కాక.. హీరో అమ్మమ్మ పాత్ర చనిపోయే సన్నివేశాల చిత్రీకరణ సహజంగా ఉన్నప్పటికీ.. లాజిక్ మాత్రం సింక్ అవ్వదు.

సినిమాలో చెప్పుకోవడానికి చాలా మైనస్ పాయింట్స్ ఉన్నాయి. అయితే, వాటిని సరైన పద్ధతిలో కవర్ చేసి దర్శకుడీగా తన ప్రతిభను చాటుకొన్నాడు ముత్తయ్య.

విశ్లేషణ : “రాయుడు” పక్కా మాస్ మసాలా సినిమా. కేవలం మాస్ ఆడియన్స్ ను మాత్రమే టార్గెట్ చేయబడి తీసిన సినిమా ఇది. సినిమాకు మహారాజా పోషకులు ఎలాగూ మాస్ ఆడియన్సే కాబట్టి “రాయుడు” వారిని అలరించడంలో వందశాతం విజయం సాధిస్తాడు.

అయితే,, చాలా సన్నివేశాల్లో లాజిక్ లు సరిగా ఉండవు. తనకు శత్రువులైన వారందర్నీ కర్కశంగా పీకలు కోసి చంపేసిన విలన్.. హీరో అమ్మమ్మను మాత్రం చలి జ్వరం వచ్చేలా చేసి మరణించేలా చేయడం వెనుక ఉన్న కారణం ఏంటో అర్ధం కాదు. అలాగే.. హీరో బలవంతుడు అని తెలిసినప్పటికీ.. అతడి చేతిలో చావడానికే రెడీగా ఉన్నట్లు, అక్కడే కూర్చొని ఉండడం లాంటి సన్నివేశాలు సినిమాకు మైనస్ అని చెప్పుకోవచ్చు.

అయితే.. లాజిక్ అనేది మన తెలుగు ప్రేక్షకులు, ముఖ్యంగా మాస్ ఆడియన్స్ పెద్దగా పట్టించుకోరు కాబట్టి.. “రాయుడు” వారిని తప్పకుండా అలరిస్తుంది. క్లాస్ మరియు మల్టీ ప్లెక్స్ ఆడియన్స్ మాత్రం సినిమాకు దూరంగా ఉండడం మంచిది.

ఫైనల్ గా చెప్పాలంటే..

మాస్ సినిమాలను ఆదరించే ఊర మాస్ ఆడియన్స్ కు మాత్రమే నచ్చే సినిమా “రాయుడు”.

రేటింగ్ : 2.5/5 

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rayudu Movie
  • #Rayudu Movie Review
  • #Rayudu Movie Telugu Review
  • #Sri Divya
  • #Vishal

Also Read

Mana ShankaraVaraprasad Garu First Review: చిరు ఖాతాలో రూ.300 కోట్ల బొమ్మ పడినట్టేనా?

Mana ShankaraVaraprasad Garu First Review: చిరు ఖాతాలో రూ.300 కోట్ల బొమ్మ పడినట్టేనా?

The RajaSaab: రెండు ముక్కలు చేయడం.. అభిమానుల్ని బాధపెట్టడం.. ఎందుకీ ఫాంటసీ బాసూ!

The RajaSaab: రెండు ముక్కలు చేయడం.. అభిమానుల్ని బాధపెట్టడం.. ఎందుకీ ఫాంటసీ బాసూ!

The RajaSaab Collections: నెగిటివ్ టాక్ తో కూడా మంచి వసూళ్ళు సాధించిన ‘ది రాజాసాబ్’

The RajaSaab Collections: నెగిటివ్ టాక్ తో కూడా మంచి వసూళ్ళు సాధించిన ‘ది రాజాసాబ్’

Nandamuri Balakrishna: అన్విత బ్రాండ్ అంబాసిడర్‌గా నందమూరి బాలకృష్ణ

Nandamuri Balakrishna: అన్విత బ్రాండ్ అంబాసిడర్‌గా నందమూరి బాలకృష్ణ

Mahesh Babu: సుమంత్, పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు మహేష్ కూడా రిజెక్ట్ చేశాడట

Mahesh Babu: సుమంత్, పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు మహేష్ కూడా రిజెక్ట్ చేశాడట

The RajaSaab: ‘ది రాజాసాబ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

The RajaSaab: ‘ది రాజాసాబ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

related news

The RajaSaab Review in Telugu: ది రాజాసాబ్ సినిమా రివ్యూ & రేటింగ్!

The RajaSaab Review in Telugu: ది రాజాసాబ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Constable Kanakam Season 2 Review in Telugu: కానిస్టేబుల్ కనకం సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Constable Kanakam Season 2 Review in Telugu: కానిస్టేబుల్ కనకం సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Vana Veera Review in Telugu: వనవీర సినిమా రివ్యూ & రేటింగ్!

Vana Veera Review in Telugu: వనవీర సినిమా రివ్యూ & రేటింగ్!

Psych Siddhartha Review in Telugu: సైక్ సిద్ధార్థ సినిమా రివ్యూ & రేటింగ్!

Psych Siddhartha Review in Telugu: సైక్ సిద్ధార్థ సినిమా రివ్యూ & రేటింగ్!

Eesha Review in Telugu: ఈషా సినిమా రివ్యూ & రేటింగ్!

Eesha Review in Telugu: ఈషా సినిమా రివ్యూ & రేటింగ్!

Patang Review in Telugu: పతంగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Patang Review in Telugu: పతంగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Mana ShankaraVaraprasad Garu First Review: చిరు ఖాతాలో రూ.300 కోట్ల బొమ్మ పడినట్టేనా?

Mana ShankaraVaraprasad Garu First Review: చిరు ఖాతాలో రూ.300 కోట్ల బొమ్మ పడినట్టేనా?

45 mins ago
The RajaSaab: రెండు ముక్కలు చేయడం.. అభిమానుల్ని బాధపెట్టడం.. ఎందుకీ ఫాంటసీ బాసూ!

The RajaSaab: రెండు ముక్కలు చేయడం.. అభిమానుల్ని బాధపెట్టడం.. ఎందుకీ ఫాంటసీ బాసూ!

2 hours ago
The RajaSaab Collections: నెగిటివ్ టాక్ తో కూడా మంచి వసూళ్ళు సాధించిన ‘ది రాజాసాబ్’

The RajaSaab Collections: నెగిటివ్ టాక్ తో కూడా మంచి వసూళ్ళు సాధించిన ‘ది రాజాసాబ్’

5 hours ago
Nandamuri Balakrishna: అన్విత బ్రాండ్ అంబాసిడర్‌గా నందమూరి బాలకృష్ణ

Nandamuri Balakrishna: అన్విత బ్రాండ్ అంబాసిడర్‌గా నందమూరి బాలకృష్ణ

8 hours ago
Mahesh Babu: సుమంత్, పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు మహేష్ కూడా రిజెక్ట్ చేశాడట

Mahesh Babu: సుమంత్, పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు మహేష్ కూడా రిజెక్ట్ చేశాడట

24 hours ago

latest news

Maruthi: రాజా సాబ్ టాక్ పై మారుతి రియాక్షన్.. ఫ్యాన్స్ కోసం గిఫ్ట్ రెడీ!

Maruthi: రాజా సాబ్ టాక్ పై మారుతి రియాక్షన్.. ఫ్యాన్స్ కోసం గిఫ్ట్ రెడీ!

2 hours ago
MSG: తప్పుడు రివ్యూలకు కోర్టు బ్రేక్.. చిరు సినిమా కోసం లీగల్ షీల్డ్

MSG: తప్పుడు రివ్యూలకు కోర్టు బ్రేక్.. చిరు సినిమా కోసం లీగల్ షీల్డ్

2 hours ago
Selvamani, ilayaraja: కాపీ రైట్‌ పంచాయితీ: ఇళయరాజాకు సీనియర్ డైరక్టర్‌ సాక్ష్యం!

Selvamani, ilayaraja: కాపీ రైట్‌ పంచాయితీ: ఇళయరాజాకు సీనియర్ డైరక్టర్‌ సాక్ష్యం!

2 hours ago
Parasakthi: హెల్మెట్‌ పెట్టుకుంటే సినిమా టికెట్లు.. బాగుంది కదా ఈ ఆఫర్‌!

Parasakthi: హెల్మెట్‌ పెట్టుకుంటే సినిమా టికెట్లు.. బాగుంది కదా ఈ ఆఫర్‌!

2 hours ago
Toxic: ‘టాక్సిక్‌’లో ఆ సీన్‌తో హైలైట్‌.. ఆ బ్యూటీ ఎవరో తెలుసా?

Toxic: ‘టాక్సిక్‌’లో ఆ సీన్‌తో హైలైట్‌.. ఆ బ్యూటీ ఎవరో తెలుసా?

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version