‘స్కంద’ సినిమా ఫస్ట్ రిలీజ్ డేట్, ఆ తర్వాత చెప్పిన రిలీజ్ డేట్‌కి మధ్య రెండు వారాల గ్యాప్ ఉంది? అవును ‘సలార్’ సినిమా వాయిదా పడటంతో లాంగ్ వీకెండ్ కోసం అక్కడకు వచ్చేశారు అని అంటారా? ఈ మాట వాళ్లు బయటకు చెబుతున్నది. అయితే అక్కడ బ్యాగ్రౌండ్‌లో జరిగింది వేరే ఉంది అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. సినిమాలో కొన్ని పొలిటికల్ డైలాగ్‌లను కత్తెరేసే క్రమంలోనే ఆ వాయిదా వేశారు అనేది లేటెస్ట్ టాక్. అంతేకాదు దాని వల్ల ఆ సినిమాను ఓ పార్టీ ఓన్ చేసుకోవాల్సి ఉన్నా అవ్వలేదు అని కూడా అంటున్నారు.
‘స్కంద’ (Skanda) సినిమా చూసినవాళ్లకు మేం చెప్పబోయే విషయం క్లియర్‌గా అర్థమైపోతుంది. అయితే చూడనివాళ్లకు కాస్త విడమరిచి చెప్పాలి. ఏంటంటే… ఈ సినిమాలో బోయపాటి శ్రీను కొన్ని పొలిటికల్ ఇంటెన్షన్ డైలాగ్‌లు పెట్టారు. ఇంకా చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న కొన్ని పథకాల డొల్లతనాన్ని ఎత్తి చూపుతూ ఆ డైలాగ్‌లు ఉన్నాయి. సినిమాను తొలి రోజుల చూసినవాళ్లు ఠక్కున ఈ మాట అనేశారు. అయితే అవి కొన్ని మాత్రమే అని… ఇంకొన్ని తీసేశారు అని అంటున్నారు.
అయితే, ఆ డైలాగ్‌ల వల్ల సినిమాను రాష్ట్రంలోని ఓ పార్టీ ఓన్ చేసుకునే అవకాశం ఉండేదట. ఏపీలో పరిస్థితుల్ని ఆ సినిమా చాలా చక్కగా పోట్రే చేసింది అని చెప్పే అవకాశమూ ఉండేది. కానీ ఆ పార్టీ అధినేత అనుకోని పరిస్థితుల్లో జైలులో రిమాండ్ ఖైదీగా ఉండటంతో ఇప్పుడు ఆ టీమ్ అంతా ఆ పనిలో ఉన్నారు. అందుకే ఈ సినిమాలోని డైలాగ్స్, దాని ఎఫెక్ట్ లాంటి అంశాలను ఆ పార్టీ టీమ్ పట్టించుకోవడం లేదు. దీంతో ‘స్కంద’ను ఓన్ చేసుకోలేకపోయారు అంటున్నారు.
దర్శకుడు బోయపాటి శ్రీను టీడీపీ మద్దతుదారు అని అంటుంటారు. గతంలో పార్టీకి అనుబంధంగా కొన్ని వీడియోలు చేశారు. ఇక రామ్ దగ్గర బంధువులు టీడీపీ అనుయాయులు అని అంటుంటారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో విజయవాడలో ఓ ఆసుపత్రి విషయంలో జరిగిన రచ్చ అందరికీ తెలిసిందే. దీంతో వాళ్లిద్దరి కాంబోలో వచ్చి, అందులోనూ పొలిటికల్ డైలాగ్స్ ఉన్న ఈ సినిమాను ఆ పార్టీ ఓన్ చేసుకునేది. కానీ ఏపీ ప్రభుత్వం ఆడుతున్న రాజకీయ క్రీడ వల్ల పరిస్థితి మారిపోయింది.