‘డియర్ కామ్రేడ్’ వంటి ప్లాప్ తర్వాత విజయ్ దేవరకొండ హిట్టు కొడతాడు అనుకుంటే .. ఈసారి కూడా చతికిలపడ్డాడు. ఆయన తాజా చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’ కూడా పెద్ద ప్లాప్ అయ్యేలా ఉంది. ఒక ‘డియర్ కామ్రేడ్’ లా మాత్రమే కాదు.. ‘నోటా’ ను మించి ప్లాపయ్యేలా కనిపిస్తుంది. క్రాంతి మాధవ్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 14న విడుదలయ్యింది. మొదటి షో తోనే ప్లాప్ టాక్ రావడంతో ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడం లేదు. ఫస్ట్ వీక్ పూర్తయినా కనీసం 10కోట్ల షేర్ ను కూడా దాటలేకపోయింది ఈ చిత్రం.
ఇక ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ను పరిశీలిస్తే :
నైజాం
4.03 cr
సీడెడ్
0.72 cr
ఉత్తరాంధ్ర
0.84 cr
ఈస్ట్
0.53 cr
వెస్ట్
0.41 cr
కృష్ణా
0.49 cr
గుంటూరు
0.70 cr
నెల్లూరు
0.30 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
0.70 cr
ఓవర్సీస్
0.98 cr
వరల్డ్ వైడ్ టోటల్
9.70 cr (share)
‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రానికి 30.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఫస్ట్ వీక్ పూర్తయ్యేసరికి కేవలం 9.70 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది . ఇంకా 10 కోట్ల షేర్ మార్క్ ను కూడా దాటకపోవడం అత్యంత ధారుణమని చెప్పాలి. ఇక 7 వ రోజైన మంగళవారం నాడు ఈ చిత్రం కేవలం 0.04 కోట్ల షేర్ ను మాత్రమే కలెక్ట్ చేసింది. ఈ చిత్రం కంటే సంక్రాంతి సినిమాలే ఇంకా బెటర్ అనిపిస్తున్నాయి. ఇక ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే మరో 20.80 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఈరోజు విడుదలైన ‘భీష్మ’ చిత్రానికి సూపర్ హిట్ రిపోర్ట్స్ వస్తున్నాయి కాబట్టి.. ఇక ఈ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ కి కష్టమనే చెప్పాలి.