“నేను సిక్స్ కొట్టాలనే మైదానంలోకి దిగుతా. సింగిల్, డబుల్ చేసే ఓపిక నాకు లేదు. కొడితే బాల్ స్టేడియం బయటపడాలనుకుంటా. అనుకున్నట్లే కొన్ని బాల్స్ స్టేడియం బయటపడ్డాయి. కొన్ని బౌండరీ లైన్ మీద క్యాచ్‌లయ్యాయి. అయినా నాకు ఎలాంటి భయం లేదు. ఇకపై అన్నీ సిక్స్ లే కొడతాను” అంటూ “వరల్డ్ ఫేమస్ లవర్” ప్రీరిలీజ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ ఇచ్చిన స్టేట్మెంట్ అందరికీ గుర్తుండే ఉంటుంది. విజయ్ ఇచ్చిన స్టేట్మెంట్ కి నిన్న విడుదలైన సినిమాకి అస్సలు సంబంధం లేదు అనిపిస్తుంది. విజయ్ తన ప్రతి సినిమాను చాలా కాన్ఫిడెంట్ గా ప్రమోట్ చేస్తాడు, ఆ విషయంలో ఎలాంటి సందేహం లేదు. కానీ.. “వరల్డ్ ఫేమస్ లవర్” విషయంలో మాత్రం సినిమాకు హైప్ తీసుకురావాలి అనే తపన కనిపించిందే కానీ.. కంటెంట్ ను ఎక్కడా హైలైట్ చేయలేదు.
అయితే.. నిన్న విడుదలైన సినిమాకు క్రిటిక్స్ & ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. “వరల్డ్ ఫేమస్ లవర్”ను “బోరింగ్ లవర్” అంటూ థియేటర్ల నుండి సినిమా ముగియకుండానే బయటకు వెళ్ళినవారే ఎక్కువ. దాంతో ఈసారి విజయ్ సిక్స్, ఫోర్ కాదు కనీసం సింగిల్ కూడా తీయలేకపోయాడు. 30 కోట్ల రూపాయల బిజినెస్ జరిగిన ఈ చిత్రం డిస్ట్రిబ్యూటర్స్ & ప్రొడ్యూసర్ కు భారీ నష్టాలు తీసుకురావడం ఖాయమని ట్రేడ్ పండితుల విశ్లేషణ. మరి విజయ్ ఇప్పుడు ఏం సమాధానం ఇస్తాడో చూడాలి. ఎప్పట్లానే “ఐ విల్ బి బ్యాక్” అంటాడో లేక అర్జున్ రెడ్డి ఫీవర్ నుంచి బయటకు వచ్చి తనను తాను కొత్తగా రీఇన్వెంట్ చేసుకుంటాడో చూద్దాం.