ఒకప్పుడు తెలుగు సినిమా అంటే.. తెలుగు సినిమానా అన్నట్టు చూసేవారు. కనీకష్టంగా కొంతమంది సౌత్ సినిమా అనేవారు. అయితే ఇప్పుడు సౌత్ సినిమా అంటే ఇండియన్ సినిమా అనేంత స్థాయికి ఎదిగింది. అలా చేసింది తెలుగు సినిమాలు.. అని చెప్పుకునేందుకు అంతా గర్వపడే సందర్భం ఇది. మన తెలుగు సినిమాలు.. పాన్ ఇండియా స్థాయిలో విడుదలై ఘన విజయం సాధిస్తున్న సందర్భాలను మనం చూస్తూనే ఉన్నాం. ఒకప్పుడు తెలుగు సినిమా అంటే రూ.70 కోట్ల లోపే థియేట్రికల్ బిజినెస్ చేసేవి. అది ఎంత పెద్ద హీరో సినిమా అయినా సరే బిజినెస్ ఆ స్థాయిలోనే ఉంటుంది. కానీ ‘బాహుబలి’ పుణ్యమా అని రూ.100 కోట్లకు పైగా బిజినెస్ చేస్తున్నాయి మన సినిమాలు. ‘బాహుబలి’ తర్వాత ‘ఆర్.ఆర్.ఆర్’ ‘పుష్ప’ వంటి సినిమాలు తెలుగు సినిమా స్థాయిని మరింతగా పెంచాయి. సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేసి 2022 లో టాలీవుడ్లో ఎక్కువ థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :
1) ఆర్.ఆర్.ఆర్ :
రాజమౌళి- రాంచరణ్- ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన ఈ పాన్ ఇండియా మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.492 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
2) రాధే శ్యామ్ :
ప్రభాస్ – పూజా హెగ్డే కాంబినేషన్లో వచ్చిన ఈ పాన్ ఇండియా మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.196.3 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కానీ ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది.
3) ఆచార్య :
చిరంజీవి – చరణ్ కాంబినేషన్లో రూపొందిన ఈ మూవీకి రూ.133.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.కానీ ఈ మూవీ పెద్ద డిజాస్టర్ గా మిగిలింది.
4) సర్కారు వారి పాట :
మహేష్ బాబు – కీర్తి సురేష్ కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీకి రూ.120 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫైనల్ గా ఈ మూవీ యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది.
5) భీమ్లా నాయక్ :
పవన్ కళ్యాణ్ – రానా కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీకి రూ.109.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ కూడా యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది.
6) గాడ్ ఫాదర్ :
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీకి రూ.89.9 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ డిజాస్టర్ గా మిగిలింది.
7) లైగర్ :
విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీకి రూ.82.15 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కానీ ఈ మూవీ పెద్ద డిజాస్టర్ గా మిగిలింది.
8) కె.జి.ఎఫ్ 2 :
యష్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందిన ఈ డబ్బింగ్(కన్నడ) మూవీకి రూ.74 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. తెలుగులో ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది.
9) ఎఫ్3 :
వెంకటేష్ – వరుణ్ తేజ్ కాంబినేషన్లో రూపొందిన ఈ మూవీకి అనిల్ రావిపూడి దర్శకుడు. ఈ మూవీకి రూ.63.82 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ అబౌవ్ యావరేజ్ గా నిలిచింది.
10) ది వారియర్ :
రామ్ హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీకి రూ.38.99 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ డిజాస్టర్ గా మిగిలింది.
11) బంగార్రాజు :
నాగార్జున- నాగ చైతన్య కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీకి రూ.38.31 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ హిట్ గా నిలిచింది.