దర్శకధీరుడు రాజమౌళి అక్టోబర్ 13వ తేదీన ఆర్ఆర్ఆర్ సినిమాను రిలీజ్ చేస్తామని చెబుతున్నా ఇండస్ట్రీకి చెందిన చాలామంది ఆర్ఆర్ఆర్ ఆ తేదీకి రిలీజ్ కావడం కష్టమేనని అనుకుంటున్నారు. ఒకవేళ ఏదైనా కారణం వల్ల ఆర్ఆర్ఆర్ పోస్ట్ పోన్ అయితే మాత్రం ఆచార్య అక్టోబర్ 13వ తేదీన రిలీజ్ చేయాలని ఆ సినిమా మేకర్స్ భావిస్తున్నారు. దసరా సీజన్ కావడంతో ఆ తేదీకి రిలీజ్ చేస్తే భారీగా కలెక్షన్లు వస్తాయని ఆచార్య మూవీ మేకర్స్ అభిప్రాయపడుతున్నారు.
అయితే టాలీవుడ్ హీరోలు బన్నీ, ప్రభాస్ కూడా తమ సినిమాలను దసరాకు రిలీజ్ చేయాలని భావిస్తున్నారని సమాచారం. ఆర్ఆర్ఆర్ రిలీజైతే మాత్రం దసరాకు మరే సినిమా రిలీజయ్యే అవకాశం లేదు. ఒకవేళ ఆర్ఆర్ఆర్ వాయిదా పడితే మాత్రం ఆచార్య, పుష్ప, రాధేశ్యామ్ సినిమాలలో రెండు సినిమాలు రిలీజయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు ఇప్పటికే కొన్ని సినిమాలు ఫిక్స్ అయ్యాయి. అందువల్ల ఈ ఏడాదే తమ సినిమాలను రిలీజ్ చేయాలని ఆచార్య, రాధేశ్యామ్, పుష్ప మూవీ మేకర్స్ భావిస్తున్నారు.
అఖండ మూవీ వినాయక చవితి కానుకగా రిలీజ్ కానుందని వార్తలు వస్తుండగా ఆ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది. దసరా సీజన్ ను ఆర్ఆర్ఆర్ మిస్ చేసుకుంటే ఆ సినిమాకు కూడా ఇబ్బందులు తప్పవు. మొత్తానికి దసరా పండుకు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు కళకళలాడటం గ్యారంటీ అని చెప్పవచ్చు. రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీని చెప్పిన డేట్ కే రిలీజ్ చేస్తారో లేదో చూడాల్సి ఉంది.