సూపర్ స్టార్ రజనీకాంత్ కు (Rajinikanth) తమిళనాడు రాష్ట్రంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఊహించని స్థాయిలో క్రేజ్ ఉందనే సంగతి తెలిసిందే. ఈ సినిమా థియేటర్లలో విడుదలై నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఓటీటీలో స్ట్రీమింగ్ కాలేదు. థియేటర్లలో ఈ సినిమాను చూడని ప్రేక్షకులు ఓటీటీ వెర్షన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా డైరెక్టర్, రజనీకాంత్ కూతురు ఐశ్వర్య (Aishwarya Rajinikanth) లాల్ సలామ్ (Lal Salaam) ఓటీటీ రిలీజ్ గురించి క్లారిటీ ఇచ్చారు. లాల్ సలామ్ మూవీతో ప్రేక్షకులకు విభిన్నమైన అనుభూతిని అందించాలని మేము తీవ్రంగా శ్రమించామని ఐశ్వర్య తెలిపారు.
కొన్ని అనివార్య కారణాల వల్ల మేము అనుకున్న విధంగా థియేటర్ వెర్షన్ రిలీజ్ కాలేదని ఐశ్వర్య చెప్పుకొచ్చారు. సినిమాలో కీలకమైన కొన్ని సన్నివేశాలు మిస్ అయ్యాయని ఆమె అన్నారు. ఆ కారణం వల్ల మా సినిమా మిశ్రమ స్పందనలకే పరిమితమైందని ఐశ్వర్య చెప్పుకొచ్చారు. అయితే ఇటీవల పోయిన హార్డ్ డిస్క్ దొరికిందని మిస్సైన సన్నివేశాలను మేము హార్డ్ డిస్క్ నుంచి రికవరీ చేయడం జరిగిందని ఆమె పేర్కొన్నారు.
త్వరలో ఆ సీన్స్ ను యాడ్ చేసి ఓటీటీలో డైరెక్టర్ కట్ వెర్షన్ ను రిలీజ్ చేస్తామని ఐశ్వర్య తెలిపారు. మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ (A.R.Rahman) హార్డ్ డిస్క్ లోని సీన్లకు బీజీఎం ఇస్తున్నారని అందుకోసం ఆయన రూపాయి కూడా తీసుకోవడం లేదని ఐశ్వర్య చెప్పుకొచ్చారు. నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఏదైనా కారణాల వల్ల ఆ ఓటీటీలో స్ట్రీమింగ్ కాకపోతే సన్ నెక్స్ట్ వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. త్వరలో ఓటీటీ రిలీజ్ డేట్ కు సంబంధించి పూర్తి వివరాలు తెలిసే అవకాశాలు ఉంటాయి. లాల్ సలామ్ ఓటీటీ వెర్షన్ ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాల్సి ఉంది.