Akhanda Collections: ఫస్ట్ మండే ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా..?

నందమూరి బాలకృష్ణ హీరోగా స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను హ్యాట్రిక్ కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ మూవీ `అఖండ`. ‘ద్వారకా క్రియేషన్స్‌’ బ్యానర్ పై మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదలయ్యి పాజిటివ్ టాక్ ను సంపాదించుకోవడంతో ఓపెనింగ్స్ ఓ రేంజ్లో నమోదయ్యాయి.మొదటి సోమవారం నాడు కూడా ఈ చిత్రం మంచి కలెక్షన్లు రాబట్టడం విశేషం. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పాలి.

ఇక ఈ చిత్రం 5 రోజుల కలెక్షన్లను గమనిస్తే :

నైజాం 13.40 cr
సీడెడ్  9.95 cr
ఉత్తరాంధ్ర 4.14 cr
ఈస్ట్ 2.79 cr
వెస్ట్ 2.23 cr
గుంటూరు 3.48 cr
కృష్ణా 2.49 cr
నెల్లూరు 1.82 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 40.30 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్  8.00 Cr
వరల్డ్ వైడ్ (టోటల్) 48.30 cr

‘అఖండ’ చిత్రానికి రూ.53.25 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.54 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి.5 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.48.3 కోట్ల షేర్ ను రాబట్టింది.బ్రేక్ ఈవెన్ కు మరో రూ.5.7 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. మొదటి సోమవారం ఈ చిత్రం రూ.3.5 కోట్ల పైనే షేర్ ను నమోదు చేసింది. వీక్ డేస్ లో కూడా ఇలాగే స్టడీ గా రాబడితే బ్రేక్ ఈవెన్ ఈజీ అని చెప్పాలి.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Share.