‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) సినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. డిసెంబర్ 5న ఈ సినిమా విడుదల కాబోతున్నప్పటికీ.. డిసెంబర్ 4 నుండి ప్రీమియర్స్ పడుతున్నాయి. సుకుమార్ (Sukumar) – అల్లు అర్జున్ (Allu Arjun) కాంబినేషన్లో వచ్చిన ‘పుష్ప’ (Pushpa) మొదటి భాగం బ్లాక్ బస్టర్ అవ్వడంతో దీనిపై అంచనాలు భారీగా పెరిగాయి. ప్రమోషన్స్ లో భాగంగా ఈరోజు హైదరాబాదులోని యూసఫ్ గూడ గ్రౌండ్స్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు.
Allu Aravind
ఈ వేడుకలో అల్లు అరవింద్ స్పీచ్ సినిమాపై మరింతగా అంచనాలు పెంచేసింది అని చెప్పాలి. ఈ సినిమాకు ఆయన ఇండస్ట్రీ హిట్ రివ్యూ ఇచ్చేశారు..! అది కూడా ‘మగధీర’ (Magadheera) సినిమాతో పోల్చి అని చెప్పాలి. అల్లు అరవింద్ (Allu Aravind) మాట్లాడుతూ..” నేను వారం రోజుల క్రితమే ‘పుష్ప 2’ చూశాను. తర్వాత ఇంటికి వెళ్ళాక మా ఆవిడ వచ్చి ‘ఏంటి మొహం అంతలా వెలిగిపోతుంది?’ అని అడిగింది.గతంలో మా ఆవిడ అలా అడిగింది ‘మగధీర’ సినిమాకి ముందు.
మళ్ళీ ఇప్పుడు ‘పుష్ప 2’ రిలీజ్ కి ముందు అంది. ఇలాంటి సినిమా చేయడానికి ముందుగా అప్రిషియేట్ చేయాల్సింది స్నేహ(అల్లు అర్జున్ భార్య) , తబిత(సుకుమార్ భార్య)..లని..! సుకుమార్, బన్నీ వింటున్నారా? వాళ్ళని అప్రిషియేట్ చేయాలి అని చెబుతున్నాను. ఎందుకంటే ఇద్దరు సినిమా పిచ్చోళ్ళని అలా 5 ఏళ్ళ పాటు వదిలినందుకు.
దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) కూడా ఇరగొట్టేశాడు. మైత్రి వాళ్ళు ఇన్ని సినిమాలు ఎలా తీస్తున్నారో? హిట్లు ఎలా ఇస్తున్నారో నాకు అర్థం కావడం లేదు” అంటూ చెప్పుకొచ్చారు. మరి అల్లు అరవింద్ చెప్పినట్టు.. నిజంగానే ఇది ‘మగధీర’..లా ఇండస్ట్రీ హిట్ అవుతుందేమో చూడాలి.
వారం రోజుల క్రితం ‘పుష్ప 2’ చూశాను..
మా ఆవిడ ‘మొహం ఇంతలా వెలిగిపోతుంది’ ఏంటి అని అడిగింది