టాలీవుడ్ సినిమాలు థియేటర్లలో మాత్రమే కాదు, టెలివిజన్‌లో కూడా అగ్రస్థానంలో నిలుస్తున్నాయి. డిజిటల్ మాధ్యమాలు ఎంతగా వృద్ధి చెందుతున్నా, మంచి కథ, విజువల్స్‌తో కూడిన సినిమాలు టీవీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ విషయంలో ప్రత్యేకంగా నిలుస్తున్నవారిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నెంబర్ వన్ లో ఉన్నాడు. టీవీ TRP రికార్డుల లిస్టులో టాప్ ప్లేస్‌లు అతని సినిమాలకే ఉండటం అతని క్రేజ్‌ను మరోసారి రుజువు చేస్తోంది.
Allu Arjun
పుష్ప 2 (Pushpa 2: The Rule) థియేటర్లలో అద్భుత విజయాన్ని సాధించి, రికార్డులను క్రియేట్ చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా టెలివిజన్‌లోనూ అదే స్థాయిలో TRP రేటింగ్ సాధించే అవకాశాలు ఉన్నాయి. పుష్ప 1 (Pushpa) టెలివిజన్‌లో 25.2 TRP సాధించి రెండో స్థానంలో నిలిచింది. దీనిని బట్టి చూస్తే పుష్ప 2 కూడా బన్నీ కెరీర్‌లో మరో మెమోరబుల్ రికార్డు అందుకోనుందని భావిస్తున్నారు. అల్లు అర్జున్ నటించిన అల.. వైకుంఠపురములో (Ala Vaikunthapurramuloo) 29.4 TRPతో ఇప్పటికీ నెంబర్ వన్ స్థానంలో ఉంది.
ఈ సినిమాలో బన్నీ నటన, తమన్ (S.S.Thaman) సంగీతం, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంశాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇది టెలివిజన్ రేటింగ్‌లో ఇప్పటివరకు ఎవరికీ అందని రికార్డు. మరోవైపు, బన్నీ మరో హిట్ మూవీ దువ్వాడ జగన్నాథం (Duvvada Jagannadham) 21.7 TRP సాధించి ఐదో స్థానంలో నిలిచింది. మహేశ్ బాబు (Mahesh Babu) నటించిన సరిలేరు నికెవ్వరు (Sarileru Neekevvaru) 23.4 TRPతో మూడో స్థానంలో ఉండగా, బాహుబలి 2 (Baahubali 2) సినిమా 22.7 TRPతో నాల్గవ స్థానంలో ఉంది.
ఈ లిస్టులో టాప్ 5 స్థానాల్లో మూడు బన్నీ సినిమాలే ఉండటం విశేషం. బన్నీ సినిమాలకు టీవీ ప్రేక్షకుల నుంచి ఎంతగానో మద్దతు లభిస్తున్నదనేది ఈ రికార్డులు స్పష్టంగా చెప్పగలవు. ఇక పుష్ప 2 టెలివిజన్‌లో ప్రసారమయ్యాక, TRP రేటింగ్‌లో బన్నీ సొంత రికార్డును బ్రేక్ చేస్తాడా అనేది ఇప్పుడు అసలు ఛాలెంజ్. ఫ్యాన్స్ అయితే రికార్డులు బ్లాస్గ్ అవ్వడం పక్కా అని కామెంట్ చేస్తున్నారు. మరి పుష్ప 2 కొత్త రికార్డులు సృష్టిస్తుందా లేదా అనేది తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.