పాన్ ఇండియా స్టార్‌గా క్రేజ్ సంపాదించుకున్న అల్లు అర్జున్ (Allu Arjun) ఇప్పుడు కెరీర్‌ను మరో ఎత్తుకు తీసుకెళ్లేందుకు గేర్ మార్చాడు. ‘పుష్ప 2’ (Pushpa 2) సెన్సేషన్ తరువాత మళ్లీ సినిమాల విషయంలో తడబడకూడదని స్పష్టంగా భావిస్తున్న బన్నీ, ఒకేసారి రెండు భారీ ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టడం విశేషం. దాదాపు ఐదేళ్ల సమయం పుష్ప సిరీస్ కోసం వెచ్చించిన ఆయన, ఇప్పుడు టైమ్ వేస్ట్ కాకుండా ఎఫెక్టివ్ ప్లానింగ్‌తో ముందుకు వెళ్తున్నాడు. ప్రస్తుతం బన్నీ అట్లీ (Atlee Kumar) దర్శకత్వంలో తెరకెక్కనున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌కు ఫుల్ కమిట్ అయ్యాడు.
స్క్రిప్ట్ ఫైనల్ అయ్యింది. ప్రీ ప్రొడక్షన్ దశ పూర్తయ్యేలోపే షూటింగ్ షెడ్యూల్ ఫిక్స్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది పూర్తిగా మాస్ ఆడియన్స్‌ను టార్గెట్ చేసే కమర్షియల్ ప్రాజెక్ట్‌గా ఉండబోతోంది. బన్నీ అట్లీ కాంబోపై ఇప్పటికే నేషనల్ వైడ్ లెవెల్‌లో భారీ అంచనాలున్నాయి. ఇకపోతే త్రివిక్రమ్‌తో బన్నీ చేయబోయే మరో సినిమా కూడా ఇదే టైంలో ప్లాన్ అవుతోంది. నిర్మాత నాగవంశీ (Suryadevara Naga Vamsi) ఇప్పటికే ఈ విషయాన్ని క్లారిటీగా చెప్పారు.
2025 లోనే త్రివిక్రమ్ (Trivikram) చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. అంటే బన్నీ ఒకదాన్ని పూర్తి చేసి, మరొకదాన్ని స్టార్ట్ చేసేలా కాకుండా, రెండు సినిమాల పనులను సమాంతరంగా చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇది చూస్తే బన్నీ తన మార్కెట్‌ను ఎలాగైనా నిలబెట్టుకోవాలని టార్గెట్ చేసుకున్నట్టే. స్టార్డమ్ ఉన్నప్పుడు ఫ్లోలో సినిమాలు చేస్తూ రెగ్యులర్‌గా రిలీజ్‌లతో కనెక్ట్ అవ్వడం ఇప్పుడు టాప్ హీరోలందరిలోను కామన్.
బన్నీ కూడా అదే దిశగా ముందుకు వెళ్లేందుకు గట్టిగానే సన్నాహాలు చేస్తున్నాడు. 2026లో బన్నీ రెండు సినిమాలతో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేయనున్నాడన్న అంచనాలు ఇప్పటికే మొదలయ్యాయి. ‘పుష్ప’ బ్రాండ్‌ను మరింత పెంచేలా, కొత్త లెవెల్‌కు తన ఇమేజ్‌ను తీసుకెళ్లేలా ఈ ప్రాజెక్టులు ఆలోచించి తీసుకున్న నిర్ణయాలే కావొచ్చని అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు.