Suriya: కంగువ సినిమాలో నటించడానికి మొదట కాస్త ఆలోచించాను: సూర్య!
- October 23, 2024 / 11:12 AM ISTByFilmy Focus
సౌత్ ఇండస్ట్రీ నుంచి వస్తున్న మరో భారీ చిత్రం “కంగువ” (Kanguva) . దాదాపు 350 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలవున్న విషయం తెలిసిందే. సూర్య (Suriya) , దిశా పటాని (Disha Patani), బాబీ డియోల్ (Bobby Deol) ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి శివ (Siva) దర్శకుడు. విడుదలైన టీజర్, ట్రైలర్ & సాంగ్స్ అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా.. సూర్య గెటప్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది.
Suriya

సినిమాలో దాదాపు రెండు గంటలపాటు ఉండే ట్రైబల్ ఎపిసోడ్ సినిమాని మరో లెవల్ కి తీసుకెళుతుందని దర్శకుడు శివ చెబుతూనే ఉన్నాడు. అయితే.. ఇటీవల సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నార్త్ మీడియాతో, ముంబైలో ముచ్చటించిన సూర్య “కంగువ” క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ.. “అసలు శివ నాకు కథ చెప్పినప్పుడు నేను ఈ స్థాయి భారీ పాత్ర పోషించగలనా అనిపించింది.

ఎందుకంటే నేను ప్రభాస్ (Prabhas) , రానా (Rana) లాంటి భారీ మనిషిని కాదు” అంటూ తనను తాను ప్రభాస్ తో కంపేర్ చేసుకుని “నేను అంతటోడ్ని కాదు” అని చెప్పడం సూర్య సింప్లిసిటీకి నిదర్శనంగా నిలిచింది. “బాహుబలి” (Baahubali)తర్వాత ఆ ఫార్ములాను ఫాలో అవుతూ చాలా సినిమాలు వచ్చాయి కానీ ఏ ఒక్క స్టార్ హీరో కూడా స్వయంగా “నేను ప్రభాస్ అంత కాదు” అని చెప్పుకోలేదు. సూర్య అలా చెప్పుకోవడాన్ని సోషల్ మీడియా జనాలు మెచ్చుకుంటున్నారు.

నవంబర్ 14న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలవుతున్న ఈ చిత్రాన్ని ఇక్కడ సక్సెస్ బట్టి జపాన్, చైనా, కొరియా భాషల్లోనూ విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు నిర్మాతలు. ఎందుకంటే ఈ తరహా పీరియాడిక్ వార్ కాన్సెప్ట్ ఫిలింస్ కి ఇంటర్నేషనల్ మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.
pic.twitter.com/x9XPOkpIpr
“To be Honest I’m not like my Dear Darling #Prabhas, not Big Made . “~ #Suriya During #Kanguva Promotions! ❤️
— RS (@rs____1213) October 22, 2024















