గోపీచంద్ ఖాతాలో చాలా హిట్లు ఉన్నాయి. కానీ అతను చేసిన ప్రయోగాత్మక సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆడకపోయినా.. ఇప్పుడు స్మాల్ స్క్రీన్ పై బాగానే చూస్తుంటారు. అలాంటి సినిమాల్లో ‘ఒంటరి’ ఒకటి. ఇదొక డిఫరెంట్ అటెంప్ట్. ఈ సినిమా అంతా బాగానే ఉంటుంది.. కానీ క్లైమాక్స్ లో హీరో కళ్ళముందే హీరోయిన్ ని విలన్ గ్యాంగ్ రేప్ చేయడం..అనే ఎలిమెంట్ ఆడియన్స్ కి రుచించలేదు.
దీంతో సినిమా ప్లాప్ గా మిగిలిపోయింది. అయితే దారుణమైన విషయం ఏంటంటే.. ఇలాంటి దారుణమైన సంఘటన నిజ జీవితంలో కూడా జరిగింది. అది కూడా ఆ సినిమాలో నటించిన హీరోయిన్ భావనపైనే జరిగింది అంటే నమ్ముతారా? కానీ ఇది నిజం. ఆమె పై లైంగిక దాడి చేయించింది ఓ స్టార్ హీరోయిన్ భర్త.అతను మరెవరో కాదు మలయాళ నటుడు దిలీప్ కుమార్.

ఈ మధ్యనే అతను జైలు నుండి విడుదలై బయటకు వచ్చాడు. స్టార్ హీరోయిన్ మంజు వారియర్ కి ఇతను మాజీ భర్త. అతను మంజు తనకి విడాకులు ఇవ్వడానికి కారణం భావన అని తెలిసి పగ పెంచుకున్నాడట దిలీప్ కుమార్. విషయంలోకి వెళితే.. ఒకసారి దిలీప్, కావ్య మాధవన్, భావన కలిసి ఫారిన్ ట్రిప్ కి వెళ్లారు. అక్కడ కావ్య, దిలీప్..ల ఎఫైర్ వ్యవహారం భావనకి తెలిసింది.
అయినప్పటికీ ఆమె సైలెంట్ గానే ఏమీ తెలీనట్టే ఉందట. కానీ ఒకసారి దిలీప్ పై మంజుకి కూడా అనుమానం వచ్చిందట. దీంతో భావనని పిలిపించి ఆరా తీయగా.. భావన అసలు నిజం బయటపెట్టేసిందట. అంతే.. వెంటనే దిలీప్ కి విడాకులు ఇచ్చేసి సెపరేట్ అయిపోయింది మంజు. అటు తర్వాత కావ్య మాధవన్ ని దిలీప్ పెళ్లి చేసుకున్నాడు. అయినప్పటికీ భావనపై పగ పెంచుకుని ఆమెపై గ్యాంగ్ రేప్ చేయించాడు.
తర్వాత పోలీసుల విచారణలో అసలు నిజం బయటపడింది. పోలీసులు దిలీప్ ని అరెస్ట్ చేయడం జరిగింది.
