నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj) సినిమా జనవరి 12న సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఓపెనింగ్స్ బాగా వచ్చినా.. టార్గెట్ పెద్దగా ఉండటం, పోటీగా రిలీజ్ అయిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) భారీ వసూళ్లు సాధిస్తూ ఉండటం వల్ల .. బ్రేక్ ఈవెన్ కి కష్టపడుతుంది. అయినప్పటికీ డీసెంట్ రన్ అయితే కొనసాగిస్తుంది. రెండో వీకెండ్ ను క్యాష్ చేసుకుంటే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
‘డాకు మహారాజ్’ సినిమాకు రూ.83 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.83.5 కోట్ల షేర్ ను రాబట్టాలి. 12 రోజుల్లో ఈ సినిమా రూ.75.53 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.7.97 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. రెండో వీకెండ్ కి కొత్త సినిమాలు లేవు. ఆ అడ్వాంటేజ్ తో బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి.