నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), దర్శకుడు బాబీ (K. S. Ravindra) కలయికలో రూపొందిన ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj) చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అయ్యింది. మొదటి షోతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ తెచ్చుకుంది. కానీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) వచ్చాక డౌన్ అయిపోయింది. బ్రేక్ ఈవెన్ కోసం స్టడీ రన్ కొనసాగిస్తుంది. అయితే రెండో వీకెండ్ ను ఈ సినిమా అనుకున్నట్టు క్యాష్ చేసుకోలేదు. దీంతో మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నట్టు అయ్యింది.
‘డాకు మహారాజ్’ సినిమాకు రూ.83 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.83.5 కోట్ల షేర్ ను రాబట్టాలి. 2 వారాల్లో ఈ సినిమా రూ.77.56 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.5.94 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. రెండో వీకెండ్ ను ఈ సినిమా అనుకున్న స్థాయిలో కలెక్ట్ చేయలేదు. దీంతో రాబోయే రోజుల్లో కూడా నిలదొక్కుకోవడం కష్టమనే చెప్పాలి.