నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj) సినిమా జనవరి 12న సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఓపెనింగ్స్ అయితే బాగా వచ్చాయి. కానీ ఫ్యామిలీ సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ Sankranthiki Vasthunam) వచ్చాక దీని వసూళ్లు తగ్గాయి. బ్రేక్ ఈవెన్ కోసం స్టడీ రన్ కొనసాగిస్తుంది. డీసెంట్ షేర్స్ వస్తున్నా 2వ వీకెండ్ పై ఎక్కువ ప్రెజర్ పడినట్టు అయ్యింది.
‘డాకు మహారాజ్’ సినిమాకు రూ.83 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.83.5 కోట్ల షేర్ ను రాబట్టాలి. 2 వారాల్లో ఈ సినిమా రూ.76.8 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.6.7 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఆదివారం రోజు ఈ సినిమా మ్యాగ్జిమమ్ రాబట్టుకోవాల్సి ఉంది. లేదు అంటే 3వ వారం కూడా కష్టపడాల్సి వస్తుంది.