 
                                                        ఎన్టీఆర్ (Jr NTR) , దర్శకుడు కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్లో దసరా కానుకగా రిలీజ్ అయిన ‘దేవర’ (Devara) ఇప్పటికీ బాగా కలెక్ట్ చేస్తుంది. ఇప్పటికే రూ.500 కోట్లు కలెక్ట్ చేసినట్లు మేకర్స్ ఓ పోస్టర్ విడుదల చేశారు. ‘దావూది’ సాంగ్ రిలీజ్ తర్వాత యాడ్ చేయడం కూడా ప్లస్ అయ్యింది అని చెప్పవచ్చు.దసరాకి విడుదలైన సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద నిలబడకపోవడంతో ‘దేవర’ లాంగ్ రన్ కి బాగా హెల్ప్ అయినట్టు అయ్యింది.

ఇక 22 రోజులకు గాను ‘దేవర’ (Devara) కలెక్షన్స్, అలాగే ప్రాఫిట్స్ లెక్కలు ఒకసారి గమనిస్తే :
| నైజాం | 57.37 cr | 
| సీడెడ్ | 29.63 cr | 
| ఉత్తరాంధ్ర | 16.88 cr | 
| ఈస్ట్ | 9.65 cr | 
| వెస్ట్ | 7.50 cr | 
| గుంటూరు | 11.94 cr | 
| కృష్ణా | 8.52 cr | 
| నెల్లూరు | 5.68 cr | 
| ఏపీ + తెలంగాణ (టోటల్) | 147.17 cr | 
| కర్ణాటక | 15.28 cr | 
| తమిళనాడు | 2.48 cr | 
| కేరళ | 0.76 cr | 
| నార్త్ | 27.62 cr | 
| ఓవర్సీస్ | 34.99 cr | 
| వరల్డ్ వైడ్ (టోటల్) | 228.53 cr (షేర్) | 
‘దేవర’ చిత్రానికి రూ.174.4 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.175 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 6 రోజులకే బ్రేక్ ఈవెన్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం 22 రోజులు పూర్తయ్యేసరికి రూ.228.53 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా రూ.53.53 కోట్ల వరకు ఓవరాల్ గా ప్రాఫిట్స్ అందించింది.
