ఇంకా నెంబర్ ఒన్ పొజిషన్ కోసం పోటీపడకపోయినప్పటికీ.. “బాహుబలి” చిత్రంతో ఆ పొజిషన్ ను కైవసం చేసుకొన్న ప్రభాస్ కోసం ఇప్పుడు ప్రొడ్యూసర్స్ అందరూ క్యూలో నిల్చున్నారు. అందులో దిల్ రాజు కూడా ఒకరు. ఆయన బ్యానర్ లో ఆల్రెడీ ప్రభాస్ రెండు సినిమాలు చేశాడు. “మున్నా, మిస్టర్ పర్ఫెక్ట్”. తన బ్యానర్ లో ప్రతి హీరో, దర్శకుడు, హీరోయిన్ కనీసం మూడు సినిమాలు చేయించడం దిల్ రాజుకి అలవాటు. ఆ తరహాలోనే ప్రభాస్ తో కూడా మూడో సినిమా ప్లాన్ చేశాడు దిల్ రాజు.
అయితే.. యువీ క్రియేషన్స్ లోనే రెండు సినిమాలు చేస్తున్న ప్రభాస్.. ఆ తర్వాత సినిమా అనేది ఇప్పటివరకూ కన్ఫర్మ్ అవ్వలేదు. దిల్ రాజు తన బ్యానర్ లో ప్రభాస్ హీరోగా ఒక క్రేజీ ప్రొజెక్ట్ ను ప్లాన్ చేశాడు. ప్రభాస్ కూడా స్టోరీ లైన్ విని ఒకే చెప్పాడు కానీ.. ఇంకా పూర్తి కథ వినలేదు. దాంతో.. తన బ్యానర్ లో ప్రభాస్ సినిమా ఎనౌన్స్ చేద్దామని చాలా ఆశలు పెట్టుకొన్న దిల్ రాజు.. ప్రభాస్ సైడ్ నుంచి ఎలాంటి కన్ఫర్మేషన్ లేకపోవడంతో సైలెంట్ గా ఉన్నాడు. మరి ప్రభాస్ ఎప్పుడు కఫ్నర్మ్ చేస్తాడో, దిల్ రాజు ఎప్పుడు ఎనౌన్స్ చేస్తాడో చూడాలి.