Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » ఇంటర్వ్యూలు » Koratala Siva Interview: దేవర విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను: కొరటాల శివ

Koratala Siva Interview: దేవర విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను: కొరటాల శివ

  • September 24, 2024 / 01:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Koratala Siva Interview: దేవర విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను: కొరటాల శివ

తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాజమౌళి తర్వాత హయ్యస్ట్ సక్సెస్ రేట్ ఉన్న స్టార్ డైరెక్టర్ కొరటాల శివ  (Koratala Siva) . చిరంజీవి  (Chiranjeevi)  -చరణ్ (Ram Charan) కాంబినేషన్ లో వచ్చిన “ఆచార్య”  (Acharya) ఒక్కటే ఫ్లాప్ అయ్యింది తప్పితే వరుస విజయాలతో విజయ దుందుభి మ్రోగించిన దార్శనీకుడు కొరటాల. ఆయన దర్శకత్వంలో ఎన్టీఆర్ (Jr NTR)  హీరోగా తెరకెక్కిన “దేవర” (Devara) సెప్టెంబర్ 27న విడుదలకు సిద్ధమవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని మీడియాతో ముచ్చటించారు కొరటాల శివ. ఆచార్య డిజాస్టర్ నుంచి ఎలా కోలుకున్నారు? దేవర రెండు భాగాలుగా విడుదల చేద్దామనే ఆలోచన ఎప్పుడొచ్చింది? వంటి ఆసక్తికరమైన విషయాలకు ఆయన చెప్పిన సమాధానాలు ఆయన మాటల్లోనే..!!

Koratala Siva Interview

అందరికీ భయం ఉండాలండీ..

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'దేవర' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
  • 2 'సత్యం సుందరం' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
  • 3 ఈ రీజన్స్ కోసం దేవరను కచ్చితంగా థియేటర్లలో చూడాల్సిందే.!

“దేవర”లో భయం అనే ఒక ఎమోషన్ సినిమా మొత్తం క్యారీ అవుతుంటుంది. నిజానికి ప్రతి మనిషిలో భయం ఉండాలి. మనం ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేయకపోవడానికి కారణం భయమే. అది బాధ్యతతో కూడిన భయం. ఆ భయాన్నే సినిమాలో మెయిన్ థీమ్ గా పెట్టుకున్నాను.

అల్లు అర్జున్ తో ఎనౌన్స్ చేసి ఆపేసిన సినిమా ఇది కాదు..

అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా నా దర్శకత్వంలో ఒక సినిమా ఎనౌన్స్ చేసి, అనంతరం ఆ ప్రాజెక్ట్ ను కారణాంతరాల వలన డ్రాప్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఎన్టీఆర్ తో దేవర కూడా సముద్రం బ్యాక్ డ్రాప్ తో ఉండేసరికి, ఇదే ఆ సినిమా అనుకుంటున్నారు కానీ.. ఆ ప్రాజెక్ట్ కు దేవరకు ఏమాత్రం సంబంధం లేదు.

ఎన్టీఆర్ చాలా హానెస్ట్ పర్సన్..

నేను ఎన్టీఆర్ ను ఒక బ్రదర్ లా ట్రీట్ చేస్తాను. అతను కూడా అదే స్థాయిలో నాతో బంధం పంచుకుంటాడు. నేను ఏదైనా సీన్ చెప్తే బాగుంది అనిపిస్తే “అబ్బా అదిరిపోయింది” అని చెప్తాడు. ఒకవేళ నచ్చకపోతే కూడా అదే ఉచ్ఛస్థాయిలో బాలేదని చెప్పేస్తాడు. ఎన్టీఆర్ అంత హానెస్ట్ గా ఉంటాడు కాబట్టే ప్రొడక్ట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ ఉండదు.

కథ రాసుకున్నప్పుడే 6 గంటల నిడివి వచ్చింది..

దేవర కథను కావాలని రెండు భాగాలుగా విడదీయలేదు. నేను కథ రాసుకున్నప్పుడే 6 గంటల నిడివి వచ్చింది. అయినా కూడా వద్దులే ఒక పార్ట్ గానే రిలీజ్ చేద్దామని షూటింగ్ స్టార్ట్ చేశాం. కానీ.. షూటింగ్ చేస్తున్నప్పుడు అవుట్ పుట్ చూసుకుని ఈ సినిమాని ఒక్క పార్ట్ గా రిలీజ్ చేయడం కష్టం అని నేను, తారక్ డిసైడ్ అయ్యి తర్వాత రెండు భాగాలుగా విడుదల చేద్దామని ఆ మేరకు పనులు మొదలెట్టాము. పార్ట్ 2 షూటింగ్ కి చాలా సమయం పడుతుంది. ఎందుకంటే.. ఎన్టీఆర్ ఆల్రెడీ కొన్ని ప్రాజెక్ట్స్ కమిట్ అయ్యారు, అవన్నీ పూర్తయ్యాక పార్ట్ 2 పనులు మొదలుపెడతాం. ఈ సినిమాకి మూడో పార్ట్ తీసే ఆలోచన ఏమాత్రం లేదు. రెండు భాగాలతోనే ముగిస్తాం.

ఆచార్య రిజల్ట్ నాపై ఎఫెక్ట్ చూపించేంత గ్యాప్ తీసుకోలేదు..

ఆచార్య రిజల్ట్ విషయంలో కాస్త బాధపడిన విషయం వాస్తవమే కానీ, ఆ రిజల్ట్ నా మీద ఎఫెక్ట్ చూపించే స్థాయి గ్యాప్ నేను తీసుకోలేదు. “ఆచార్య” విడుదలైన 20 రోజులకు “దేవర” మోషన్ పోస్టర్ వర్క్ మొదలుపెట్టాం. అందువల్ల ఆ రిజల్ట్ ను కానీ, రిజల్ట్ ఎఫెక్ట్ ను కానీ నేను తర్వాత పట్టించుకోవాల్సిన పని పడలేదు.

ఆచార్య ఫ్లాప్ తర్వాత మొదట మెసేజ్ చేసిన వ్యక్తి చిరంజీవి..

మీడియాలో చిరంజీవిగారికి నాకు మధ్య పొరపచ్చాలు వచ్చాయి అని చాలా కథనాలు వచ్చాయి కానీ.. నిజానికి మా ఇద్దరి మధ్య సఖ్యత బాగానే ఉంది. “ఆచార్య” రిలీజ్ తర్వాత రిజల్ట్ డిక్లేర్ అయ్యాక నాకు మొదట మెసేజ్ చేసిన వ్యక్తి చిరంజీవి గారే. “యు విల్ బౌన్స్ బ్యాక్ స్ట్రాంగర్ శివ” అని ఆయన పంపిన మెసేజ్ ను నేను ఎప్పడు మర్చిపోను. అందువల్ల ఆయనతో నాకు మనస్పర్థలు ఉన్నాయనే వదంతుల్ని నేను పట్టించుకోను.

ప్రీరిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడం చాలా బాధాకరం..

“దేవర” ప్రీరిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడం చాలా బాధ కలిగించింది. ఎందుకంటే.. మేము ఆడియన్స్ తో మాట్లాడే ఏకైక సందర్భం అది. అందరం స్పీచులు ప్రిపేర్ అయ్యాం. ఎవరి గురించి మర్చిపోకుండా మాట్లాడాలి అని ఒకటికి పదిసార్లు పేర్లు క్రాస్ చేసుకొని రెడీ అయ్యాక ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడం బాధాకరం. దానికి ఎవరు కారణం అని నన్ను అడిగితే నేనేం చెప్పలేను.

సోషల్ మీడియాకు అందుకే దూరంగా ఉంటున్నాను..

నేను ట్విట్టర్ కి దూరమవ్వడానికి కారణం మితిమీరిన నెగిటివిటీ. నేను సరదాగా నా సినిమా గురించి ఏమైనా పంచుకుందాం అనుకొని ట్విట్టర్ లో చేరాను. కానీ అక్కడ పాజిటివ్ మైండ్ అనేది నాకు కనిపించలేదు. మీమ్స్ వేసుకోవచ్చు, జోకులు వేసుకోవచ్చు కానీ హేట్రెడ్ అనేది మంచిది కాదు.

గ్రాఫిక్స్ విషయంలో నాలుగు రోజుల ముందు వరకు చెక్కుతూనే ఉన్నాం..

సినిమా ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ అయ్యాక వచ్చిన ఫీడ్ బ్యాక్ ను తప్పకుండా తీసుకుంటాను. గ్రాఫిక్స్ విషయంలో మొన్నటివరకు బెటర్ మెంట్ కోసం చెక్కుతూనే ఉన్నాం. ముఖ్యంగా షార్క్ ఫిష్ ఎపిసోడ్ & సీజీ వర్క్ విషయంలో చాలా నిక్కచ్చిగా వ్యవహరించాం.

Shocking Trolls on Devara Movie Graphic

దేవిశ్రీప్రసాద్ తో నా కాంబినేషన్ కి కావాలనే గ్యాప్ ఇచ్చాను..

నేను వరుసబెట్టి దేవిశ్రీప్రసాద్ తో (Devi Sri Prasad) వర్క్ చేసాక, నేను మరీ కంఫర్ట్ జోన్ లో ఉండిపోతున్నానేమో అనిపించింది. అందుకే దేవికి చెప్పాను “కొంచెం గ్యాప్ తీసుకొని మళ్లీ కలిసి వర్క్ చేద్దామని”. తర్వాత “ఆచార్య” కోసం మణిశర్మ (Mani Sharma) , ‘దేవర” కోసం అనిరుధ్ తో వర్క్ చేసాను. కచ్చితంగా నెక్స్ట్ సినిమాకి దేవిశ్రీప్రసాద్ తో వర్క్ చేస్తాను.

  • Dheeraj Babu

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Interviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Acharya
  • #Devara
  • #Jr Ntr
  • #koratala siva

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

10 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

11 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

12 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

12 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

15 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 days ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version