యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) , కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్ లో తెరకెక్కిన దేవర (Devara) సినిమా ఈ వీకెండ్ కలెక్షన్లతో 500 కోట్ల రూపాయల క్లబ్ లో చేరడం పక్కా అని చెప్పవచ్చు. ఎక్కువ సంఖ్యలో సినిమాలు విడుదలవుతూ ఉండటంతో దేవరకు గతంతో పోల్చి చూస్తే థియేటర్ల సంఖ్య తగ్గింది. దేవర సీక్వెల్ వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే దేవర2 వచ్చే ఏడాది అక్టోబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది.
Koratala Siva
దేవర2 సినిమాలో వర పాత్ర వీర విహారం ఉంటుందని కామెంట్లు చేస్తూ కొరటాల శివ ఈ సినిమాపై అంచనాలను పెంచేశారు. దేవర2 సీక్వెల్ గా దేవర3 మాత్రం ఉండదని తేల్చి చెప్పారు. దేవర సినిమాను రెండు భాగాలుగా మాత్రమే తెరకెక్కిస్తున్నామని దేవర2 సినిమాకు ఫ్రాంఛైజీ ఉండదని కొరటాల శివ కామెంట్లు చేశారు. దేవర2 సినిమాకు సీక్వెల్ అంటే ప్రేక్షకుల్లో ఆసక్తిని తగ్గించినట్టు అవుతుందని ఆయన పేర్కొన్నారు.
ఏ సినిమాను అయినా రెండు భాగాలుగా ముగిస్తే మాత్రమే మంచి ఫలితాలు వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. కొరటాల శివ కామెంట్లు అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తున్నాయి. దేవర సక్సెస్ తో రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లు కొన్ని రోజుల పాటు కళకళలాడాయని చెప్పవచ్చు. ఇప్పటికీ చెప్పుకోదగ్గ స్థాయిలో మెయిన్ సెంటర్లలో దేవర ప్రదర్శితమవుతూ ఉండటం గమనార్హం.
దేవర మూవీ థర్డ్ వీకెండ్ కలెక్షన్లు ఏ స్థాయిలో ఉండనున్నాయో చూడాల్సి ఉంది. దేవర మూవీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఎంతగానో నచ్చింది. గత కొన్నేళ్లుగా మాస్ సినిమాలకు దూరంగా ఉన్న తారక్ ఈ సినిమాతో మరోసారి మాస్ ప్రేక్షకుల్లో తనకు ఏ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో చెప్పకనే చెప్పేశారు. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లకు ఈ సినిమా మంచి లాభాలనే అందించిందని తెలుస్తోంది.