Game Changer: నిర్మాత దిల్ రాజుపై శంకర్ పగబట్టేశాడా?
- September 17, 2024 / 09:43 AM ISTByFilmy Focus
చరణ్ (Ram Charan) అభిమానుల సహనాన్ని మాత్రమే కాదు నిర్మాత దిల్ రాజు సహనాన్ని కూడా ఎక్కువగా పరీక్షిస్తున్నాడు దర్శకుడు శంకర్ (Shankar) . తమిళ ఫిలిం మేకర్స్ కి తెలుగు వాళ్ళు అంటే ఎంత చులకనో ఇప్పుడు మరోసారి ప్రూవ్ అయ్యింది. విషయంలోకి వెళితే.. శంకర్- చరణ్ కాంబినేషన్లో ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) మొదలయ్యి 3 ఏళ్ళు కావస్తోంది. ఇంకా సినిమా కంప్లీట్ అయ్యింది లేదు. ‘గేమ్ ఛేంజర్’ కోసం దిల్ రాజు (Dil Raju) అనుకున్న బడ్జెట్ రూ.200 కోట్లు. అది కొంచెం పెరిగితే రూ.250 కోట్లు అనుకున్నాడు.
Game Changer

కానీ ఆ లెక్క ఎప్పుడో దాటేసింది.అది వేరే సంగతి. దర్శకుడు శంకర్ తో సినిమా అంటే మామూలుగా ఉండదు. ‘గ్రాండియర్… గ్రాండియర్’ అంటూ అతను నిర్మాత చేతికి చిల్లు పెట్టేస్తాడు. ‘గేమ్ ఛేంజర్’ విషయంలో అదే జరిగింది. 50 వ సినిమా కాబట్టి.. దిల్ రాజు గ్రాండ్ గా ఈ సినిమాని చేయాలనుకున్నారు. ఆ మాట ముందుగా శంకర్ కి చెప్పి తప్పు పని చేశారాయన. ఇప్పుడు ఈ సినిమాకి అయిన బడ్జెట్ రూ.370 కోట్లు అని తెలుస్తుంది.

ఇందులో వేస్టేజీ రూ.100 కోట్లట. అంటే సినిమా (Game Changer) కోసం శంకర్ షూట్ చేసిన ఫుటేజీలో చాలా వరకు డస్ట్ బిన్ లో పడేశాడట శంకర్. దాని వ్యాల్యూ రూ.100 కోట్లకి చేరినట్టు తెలుస్తుంది. ఆ మొత్తంతో ఓ స్టార్ హీరో సినిమా తీసేయొచ్చు. శంకర్ పైత్యం అలా ఉంటుంది. అతను షూటింగ్ కోసం కావాలని దిల్ రాజుతో చెప్పింది.. టైంకి సెట్స్ లో లేకపోతే, అతను షూటింగ్ స్పాట్ నుండి వెళ్ళిపోతాడట. ఇలా చాలా సార్లు జరిగింది అని సమాచారం.
















