కథలో ఏ సమస్యా ఉండదు.. కాలంతోనే సమస్య అంటుంటారు సినిమా పరిశ్రమలో. అంటే అన్నీ అనుకున్న తర్వాత వివిధ పరిస్థితుల వల్ల సినిమాలు ఆగిపోతూ ఉంటాయి. కొన్ని ప్రాజెక్టులు ముందుకెళ్లవు. అలా పవన్ కల్యాణ్‌తో (Pawan Kalyan) ఓ సినిమా చేసే అవకాశాన్ని ప్రస్తుతానికి కోల్పోయారు యువ దర్శకుడు విజయ్ కనకమేడల (Vijay Kanakamedala). ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) సినిమా చిత్రీకరణ సమయంలో దాదాపు పవన్ – విజయ్ కనకమేడల సినిమా దాదాపు ఫిక్స్ అయిపోయిందట. కానీ ఓ అరెస్టు కారణంగా సినిమా ఆలోచన ముందుకెళ్లలేదు. ఈ విషయాన్ని ఆయనే చెప్పుకొచ్చారు.
‘భైరవం’ (Bhairavam) సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న విజయ్ కనకమేడల.. కొన్ని నెలల క్రితం పవన్ కల్యాణ్‌కు ఓ స్టోరీ లైన్ చెప్పారట. ఆ పాయింట్ నచ్చడంతో కథ చెప్పమని పవన్ అడిగారట. తీరా కథ ఆలోచన చెప్పాక.. పవన్ సినిమాలకు దూరం అవ్వడంతో ఆ ఆలోచ అక్కడే ఆగిపోయిందట. ఇదంతా జరిగింది ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెట్‌లో. అయితే ఈ సినిమా మళ్లీ మొదలైతే ఆ సినిమా ఆలోచనను మళ్లీ బయటకు తీస్తా అని చెప్పారు విజయ్ కనకమేడల.
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా చిత్రీకరణ జరుగుతున్న సమయంలో సెకండ్ యూనిట్‌ని హ్యాండిల్ చేయమని విజయ్ కనకమేడలను (Vijay Kanakamedala) పిలిచారట దర్శకుడు హరీశ్ శంకర్ (Harish Shankar). హరీశ్ దగ్గర దర్శకత్వ విభాగంలో గతంలో విజయ్ పని చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ‘గబ్బర్ సింగ్’ (Gabbar Singh) సినిమాకు కలసి పని చేసిన పరిచయంతో విజయ్‌ను పవన్ పిలిచి తన సినిమాలు ‘ఉగ్రం’ (Ugram), ‘నాంది’ గురించి మాట్లాడారట. నెక్స్ట్ ఏంటి అని పవన్ అడగ్గా కామన్‌మ్యాన్ యాక్ట్ అనే అంశంలో కథ ఉందని చెప్పారట.
అప్పటికే ఆ అంశం మీద అవగాహన ఉన్న పవన్.. కథ విని, సినాప్సిస్ చదివి మనం ఈ సినిమా చేద్దాం అని అన్నారట. కథ పూర్తిగా చదువుతా అని, రేపొచ్చాక మాట్లాడదాం అని పవన్ చెప్పారట. అయితే ఆ రోజు రాత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టు అవ్వడంతో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిస్థితులు మారి పవన్ పూర్తిగా రాజకీయాల్లోకి వెళ్లిపోయారు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఆగిపోయింది. దీంతో విజయ్ కనకమేడల సినిమా కూడా హోల్డ్‌లో పడింది.