అన్నీ అనుకున్నట్టు జరిగితే సరిగ్గా నెల రోజుల తర్వాత అంటే జనవరి 7న ‘ఆర్.ఆర్.ఆర్’ విడుదల అవుతుంది. సంక్రాంతి పోటీ అక్కడి నుండే మొదలవుతుంది. ఆ తర్వాత 12న ‘భీమ్లా నాయక్’, 14న ‘రాధే శ్యామ్’, 15న ‘బంగార్రాజు’ విడుదలవుతాయి. వీటిలో ‘బంగార్రాజు’ ని అంటే నాగార్జున ని పక్కన పెడితే పవన్ కళ్యాణ్,రాంచరణ్,ఎన్టీఆర్,ప్రభాస్ అభిమానుల మధ్య మాటల యుద్దాలు ఎక్కువగానే జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా ‘ఆర్.ఆర్.ఆర్’ పై పవన్ అభిమానులు విరుచుకుపడుతున్నారు.
‘ఆర్.ఆర్.ఆర్’ హీరోల అభిమానులు #RRRFestInOneMonth అనే హ్యాష్‌ట్యాగ్ తో ట్రెండ్ చేస్తుంటే, ‘భీమ్లా నాయక్’ హీరోల అభిమానులు #BHEEMLANAYAKon12thJAN అనే హ్యాష్‌ట్యాగ్‌ని ట్రెండ్ చేస్తున్నారు. ఓ రకంగా చూసుకుంటే ఒక్క ‘రాధే శ్యామ్’ తప్పసంక్రాంతికి అనౌన్స్ చేసిన సినిమాలన్నీ మల్టీస్టారర్ లే అనుకోవాలి. ‘ఆర్.ఆర్.ఆర్’ లో చరణ్, ఎన్టీఆర్ ఉంటే.., ‘భీమ్లా నాయక్’ లో పవన్, రానా ఉన్నారు. ఇక ‘బంగార్రాజు’ లో కూడా నాగార్జున తో పాటు నాగ చైతన్య కూడా ఉన్నాడు.
కాబట్టి ఈ సినిమాల పై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఓ పక్క ఈ సినిమాలకి స్క్రీన్లు ఎలా సర్దుబాటు చెయ్యాలా? అని నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు నిద్ర లేకుండా ఆలోచిస్తూ మీటింగ్ల మీద మీటింగ్ లు పెడుతుంటే…అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో హ్యాపీగా ఒకరినొకరు ట్రోల్ చేసుకోవడమే పని అన్నట్టు వ్యవహరిస్తున్నారు.