టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న హీరోలలో విశ్వక్ సేన్ ఒకరు కాగా విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయి. తను హీరోగా తెరకెక్కిన ప్రతి సినిమా ప్రత్యేకంగా ఉండేలా విశ్వక్ సేన్ జాగ్రత్తలు తీసుకుంటారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా విశ్వక్ సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ నుంచి గ్లింప్స్ విడుదలైంది. ఈ గ్లింప్స్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.
గోదారోళ్ళం… తేడాలొస్తే నవ్వుతూ నరాలు లాగేస్తాం అంటూ టీజర్ లో విశ్వక్ సేన్ చెప్పిన డైలాగ్ టీజర్ కు హైలెట్ గా నిలిచింది. గోదావరి యాస, భాషను విశ్వక్ సేన్ అద్భుతంగా పలికించారు. గతంలో తెలంగాణ యాసలో పలు సినిమాలు చేసిన విశ్వక్ సేన్ సినిమాకు అనుగుణంగా కొత్తగా కనిపించడానికి తన వంతు ప్రయత్నిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కృష్ణ చైతన్య డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది.
యువన్ శంకర్ రాజా మ్యూజిక్ గ్లింప్స్ కు హైలెట్ గా నిలిచింది. ఎక్కువగా క్లాస్ రోల్స్ లో నటించిన విశ్వక్ సేన్ ఇప్పుడు మాత్రం ఊర మాస్ రోల్స్ లో నటించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. విశ్వక్ సేన్ పదకొండో సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ ఏడాదే ఈ సినిమా రిలీజ్ కానుందని భోగట్టా. సాయికుమార్, గోపరాజు రమణ, నాజర్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ప్రముఖ నటి అంజలి సైతం ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారని సమాచారం అందుతోంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విశ్వక్ సేన్ కోరుకున్న సక్సెస్ ను అందించి నటుడిగా విశ్వక్ సేన్ రేంజ్ ను పెంచాలని అభిమానులు కోరుకుంటున్నారు. దాస్ కా ధమ్కీ మూవీతో సక్సెస్ సాధించిన విశ్వక్ సేన్ ఈ సినిమాతో (Gangs Of Godavari) ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాల్సి ఉంది.