‘లక్ష్యం’, ‘లౌక్యం’ వంటి సూపర్ హిట్ల తర్వాత గోపీచంద్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రామబాణం’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్,వివేక్ కూచిభొట్ల కలిసి నిర్మించారు. గోపీచంద్ సరసన డింపుల్ హయతి హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ వచ్చింది. మే 5న రామబాణం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జగపతి బాబు, ఖుష్బూ , గెటప్ శ్రీను, అలీ, సప్తగిరి వంటి వారు కీలక పాత్రలు పోషించారు.
ఇక ఈ చిత్రాన్ని వీక్షించిన కొంతమంది ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. వారి టాక్ ప్రకారం.. ‘రామబాణం’ ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా ఉందట. హీరోయిన్ ట్రాక్, సింక్ కానీ కామెడీ రొటీన్ గా జబర్దస్త్ ను తలపించేలా అలాగే విసిగించే విధంగా ఉంటాయట. అయితే సెకండ్ హాఫ్ సినిమాని నిలబెట్టింది అని అంటున్నారు.
జగపతి బాబు – గోపీచంద్ మధ్యలో వచ్చే సన్నివేశాలు, యాక్షన్ సీన్స్, క్లైమాక్స్ సినిమాకి ఆయువుపట్టుగా నిలిచాయని అంటున్నారు. ఓవరాల్ గా (Ramabanam) ‘రామబాణం’ ఫ్యామిలీ ఆడియన్స్ ను మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే విధంగా ఉన్నా.. కొత్త కంటెంట్ అయితే కాదు అని అంటున్నారు.
#RamaBanam Review : “Outdated & Cliched to the Core”
One Of The Finest Art To Make a Movie Wonder Audience without Boring they Feel The Joy #Gopichand Mark Of Action Sequences Comedy timing Added more ingrained in Movie..
#RamaBanam Overall A Completely Outdated Commercial Entertainer that is predictable to the core!
A few comedy scenes are ok and a few songs are decent but other than that nothing worth mentioning. Reminds us of films in the last decade. Hard to sit through.
Good to see you back in your strong forte, The Action-Family Entertainer @YoursGopichand Anna.
Wishing #Ramabanam continues the success spree of @peoplemediafcy