‘బాహుబలి2’ తరువాత సుమారు రెండేళ్ళ గ్యాప్ తరువాత ప్రభాస్ నుండీ వస్తున్న చిత్రం ‘సాహో’. సుజీత్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ‘యూవీ క్రియేషన్స్’ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ లు భారీ బడ్జెట్ తో నిర్మించారు. 350 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రం నిర్మితమయ్యింది. ఇక ఈ చిత్రం కోసం ఇండియా వైడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, ట్రైలర్లకు అద్భుతమైన స్పందన లభించింది.
తాజాగా ఈ చిత్రానికి సంబందించిన సెన్సార్ పనులు పూర్తయ్యాయి. ఇక ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ‘యు/ఎ’ సర్టిఫికెట్ ను జారీ చేశారు. ఈ చిత్రం నిడివి 2 గంటల 51 నిమిషాల 52 సెకండ్లు. ఇక ఈ చిత్రంలో కొన్ని సీన్లకి కత్తెర కూడా వేశారు. అవేంటో ఇప్పుడు చూద్దాం రండి :
1) సినిమా బిగినింగ్ మరియు ఇంటర్వెల్ సమయంలో .. ‘స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజ్యూరియస్ టు హెల్త్’ అని వచ్చే ‘వాయిస్ ఓవర్’ అందరికి తెలిసిందే.
2) ఫ*****గ్ బా****ర్డ్ అనే పదాన్ని ‘మ్యూట్’ చేశారట.
3) బా****ర్డ్ అనే పదాన్ని ‘మ్యూట్’ చేశారట
4) ఫ*****గ్ అనే పదాన్ని ‘మ్యూట్’ చేశారట
5) ఈ చిత్రంలో పక్షుల్ని, జంతువులని చూపించడానికి కంప్యూటర్ గ్రాఫిక్స్ ఉపయోగించారట. అవి కనిపించేప్పుడు ‘కంప్యూటర్ గ్రాఫిక్స్’ అని సైడ్ న అక్షరాలు వస్తాయట.
6) లిక్కర్ లేబుల్ బ్రాండ్స్ ను సి.జి తో కవర్ చేశారట
7) విలన్ ని హీరో రిపీటెడ్ గా మొహం పై కొట్టే షాట్స్ రన్ టైం ను తగ్గించారట
8) కంటికి కుట్లు వేసే సన్నివేశాన్ని తక్కువ చేశారట.
మొత్తానికి ఈ సీన్లకి సెన్సార్ వేటు తప్పలేదు. కానీ సెన్సార్ బోర్డు వారు యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సినిమా రన్ టైం కాస్త ఎక్కువగా కనిపిస్తున్నా… అసలు ఆ ఫీలింగ్ అనేది లేకుండా సుజీత్ తన డైరెక్షన్ తో మ్యాజిక్ చేసాడట. ఓవర్ ఆల్గా ‘సాహో’ చిత్రం ఆకట్టుకునే విధంగా ఉందట. ఆగష్టు 30న ప్రేక్షకుల నుండీ ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి..!