ఇలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నేచురల్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నాని ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. తాజాగా దసరా సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి నాని త్వరలోనే హాయ్ నాన్న సినిమా ద్వారా ప్రేక్షకుల ముందు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా డిసెంబర్ 7వ తేదీ విడుదల కానుంది. డిసెంబర్ 7వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఒక ఆంగ్ల మీడియా పత్రికకు నాని ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ఎన్నో విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. తాను ఇదివరకు తండ్రి పాత్రలలో నటించాను అయితే ఏ సినిమాలోని కలగని అనుభూతి హాయ్ నాన్న సినిమాలో నటించిన సమయంలో నాకు కలిగిందని నాని తెలిపారు. హాయ్ నాన్న సినిమాలో నటించినప్పటి నుంచి నాకు కూడా ఒక కూతురు ఉంటే బాగుంటుందనే ఫీలింగ్ కలుగుతుందని నాని తెలిపారు.
ఇంతకుముందు తండ్రి పాత్రలలో నటించిన ఒక అమ్మాయికి తండ్రిగా నటిస్తున్నటువంటి ఆ ఫీలింగ్ సరికొత్త అనుభూతిని కలిగించిందని నాని తెలియజేశారు. ఇలా కూతురు ఉంటే బాగుంటుంది అంటూ నాని చేసినటువంటి ఈ కామెంట్స్ బట్టి చూస్తుంటే ఈయన కూతురి ప్రేమ కోసం పరితపిస్తున్నారని తెలుస్తోంది. ఇక నాని అంజనా దంపతులకు ఇదివరకు ఒక కుమారుడు ఉన్న సంగతి మనకు తెలిసిందే.
ఇలా నాని (Nani) దంపతులకు కుమారుడు ఉన్నారు కానీ కూతురు లేకపోవడంతో ఈయనకి కూడా కూతురు కావాలనే ఇష్టాన్ని ఈ సందర్భంగా బయటపెట్టారు. ఇక నాని మృణాల్ ఠాకూర్ నటించిన హాయ్ నాన్న సినిమా తండ్రి కూతురు నేపథ్యంలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించినటువంటి అప్డేట్స్ విడుదల చేయగా సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెరిగిపోయాయి మరి ఈ సినిమా ఎలా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో తెలియాల్సి ఉంది.