నేచురల్ స్టార్ నాని హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం ‘హాయ్ నాన్న’. శౌర్యువ్ అనే నూతన దర్శకుడు తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ‘వైరా ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై మోహన్ చెరుకూరి (సివిఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మించారు. శృతి హాసన్ కూడా స్పెషల్ కేమియో చేస్తున్న ఈ మూవీ డిసెంబర్ 7 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. టీజర్, ట్రైలర్ వంటివి ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ తో పాస్ మార్కులు వేయించుకున్నాయి.
హేషమ్ అబ్దుల్ వాహాబ్ సంగీతంలో రూపొందిన పాటలు అన్నీ ప్రేక్షకాదరణ పొందాయి. దీంతో బిజినెస్ కూడా బాగానే జరిగింది అని చెప్పాలి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ‘హాయ్ నాన్న’ థియేట్రికల్ బిజినెస్ వివరాలు ఓ లుక్కేద్దాం రండి :
నైజాం
9.00 cr
సీడెడ్
2.80 cr
ఉత్తరాంధ్ర
3.00 cr
ఈస్ట్
1.50 cr
వెస్ట్
1.20 cr
గుంటూరు
1.60 cr
కృష్ణా
1.80 cr
నెల్లూరు
0.75 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
21.65 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
2.00 cr
ఓవర్సీస్
7.00 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
30.65 cr (షేర్)
‘హాయ్ నాన్న’ (Hi Nanna) చిత్రానికి రూ.30.65 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కి ఈ చిత్రం రూ.31 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. నాని గత చిత్రం ‘దసరా’ రూ.60 కోట్ల పైనే కలెక్ట్ చేసింది. అలా అని.. ‘హాయ్ నాన్న’ టార్గెట్ ఈజీ అని చెప్పలేము.
ఎందుకంటే ‘దసరా’ అనేది కంప్లీట్ మాస్ ఫిలిం. దాని టార్గెటెడ్ ఆడియన్స్ ..ఆ సినిమాని యాక్సెప్ట్ చేశారు. కానీ ‘హాయ్ నాన్న’ అనేది క్లాస్ మూవీ. ఇది గట్టెక్కాలి అంటే స్ట్రాంగ్ పాజిటివ్ టాక్ రావాలి.