బాహుబలి చిత్రంతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. అతని రెమ్యునరేషన్ కూడా అంతే విధంగా అధికమైనట్లు తెలిసింది. బాహుబలి బిగినింగ్ కి డార్లింగ్ 15 కోట్లు అందుకున్నారు. 600 కోట్లు వసూల్ చేసిన ఈ మూవీ హీరోకి ఇచ్చిన పారితోషికం తక్కువే. కానీ సినిమా రిలీజ్ కి ముందే ఫిక్స్ కావడంతో అంతటితో సరి పెట్టారు. అంతేకాదు ఈ చిత్రం ఇంత ఘన విజయం సాధిస్తుందని దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి బృందం కూడా మొదట అంచనా వేయలేకపోయారు. సో రెమ్యూనరేషన్లో మార్పులేదు. ప్రస్తుతం ముగింపు దశలో ఉన్న బాహుబలి కంక్లూజన్ కి మాత్రం రెట్టింపు పారితోషికం అందుకున్నట్లు సమాచారం. అంటే ఒక సినిమాకు ప్రభాస్ 30 కోట్లు తీసుకున్నారు.
ఇప్పటివరకు టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు ట్వంటీ ప్లస్ కోట్లు అందుకున్నారు. అదే హైయ్యెస్ట్ రెమ్యునరేషన్ గా రికార్డుల్లో ఉంది. వాటన్నింటిని డార్లింగ్ బద్దలు కొట్టారు. బాహుబలి 2 కి మాత్రమే కాకుండా, ఆ తర్వాత సుజీత్ దర్శకత్వంలో చేయనున్న మూవీ కి కూడా 30 కోట్లు తీసుకోనున్నారు. దీంతో టాలీవుడ్ లో నంబర్ వన్ స్థానం యంగ్ రెబల్ స్టార్ సొంతమైంది. ప్రభాస్ మూడేళ్లుగా పడిన కష్టానికి ఇది గుర్తింపు అని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. యువీ క్రియేషన్స్ బ్యానర్లో రూపుదిద్దుకోనున్న కొత్త సినిమా జనవరి నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది. దీనిని 150 కోట్ల బడ్జెట్ తో ఏక కాలంలో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కించేందుకు సుజీత్ అంతా సిద్ధం చేశారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.