కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay Thalapathy) చివరి సినిమాగా ‘జన నాయగన్’ (Jana Nayagan) తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘దళపతి 69′(వర్కింగ్ టైటిల్) తో మొదలైన ఈ సినిమాకి హెచ్ వినోద్ (H. Vinoth) దర్శకుడు. ‘కేవీఎన్ ప్రొడక్షన్స్’ బ్యానర్ పై వెంకట్ కె నారాయణ (Venkat K. Narayana) నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ కి మంచి స్పందన లభించింది. మొన్నామధ్య ఈ సినిమా 2025 అక్టోబర్ 17న ఈ సినిమా రిలీజ్ చేస్తున్నట్టు టాక్ నడిచింది.
కానీ 2026 సంక్రాంతి కానుకగా ఈ సినిమాని రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టు ఫిల్మీ ఫోకస్ ఇది వరకే వెల్లడించింది. దాన్ని నిజం చేస్తూ.. ఈరోజు మేకర్స్ ‘జన నాయగన్’ రిలీజ్ డేట్ ని ప్రకటించారు. 2026 జనవరి 9న ఈ చిత్రాన్ని తమిళ్ తో పాటు తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నట్టు ఓ పోస్టర్ ద్వారా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా తెలుగు రిలీజ్ రైట్స్ ని ‘మైత్రి’ లేదా దిల్ రాజు దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నట్టు వినికిడి.
అంతా బాగానే ఉంది కానీ.. అదే రోజున అంటే జనవరి 9 నే ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతున్న ‘ఎన్టీఆర్ 31′(వర్కింగ్ టైటిల్ డ్రాగన్) ను విడుదల చేయబోతున్నట్టు ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు అనౌన్స్ చేయడం జరిగింది. అది కూడా పాన్ ఇండియా సినిమానే. అయితే అనుకున్న టైంలో ఆ సినిమా షూటింగ్ కంప్లీట్ అవుతుంది అనే గ్యారెంటీ లేదు. ఒకవేళ కంప్లీట్ అయ్యి అదే రోజున రిలీజ్ చేయాలనుకుంటే.. రెండు సినిమాల ఓపెనింగ్స్ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..!