‘కల్కి 2898 ఎడి’ (Kalki 2898 AD) సంచలన విజయాన్ని సాధించడంతో సీక్వెల్‌పై అంచనాలు భారీగా పెరిగాయి. ఇప్పటికే మేకర్స్ సెకండ్ పార్ట్ స్క్రిప్ట్ పనులను వేగంగా పూర్తి చేస్తూ, ప్రీ-ప్రొడక్షన్ పనులను షెడ్యూల్ చేసుకుంటున్నారు. తాజా సమాచారం ప్రకారం, ‘కల్కి 2’లో (Kalki2) అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) పోషించిన అశ్వథ్థామ పాత్రకు మరింత ఎలివేషన్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. మొదటి భాగంలో ఆయన పాత్రను పరిచయం చేసిన విధానం ఆసక్తిని రేపగా, రెండో పార్ట్‌లో ఆ క్యారెక్టర్ కీలకంగా మారనుందని టాక్.
ఇటీవలే అమితాబ్ బచ్చన్, కౌన్ బనేగా కరోడ్‌పతి షోలో మాట్లాడుతూ జూన్ నుంచి ‘కల్కి 2’ షూటింగ్‌లో పాల్గొనబోతున్నానని ప్రకటించారు. దీనితో పాటు, ఆయన పాత్ర నిడివి మరింత పెరుగుతుందని, ప్రభాస్ (Prabhas) , కమల్ హాసన్‌తో (Kamal Haasan) కీలక యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మొదటి భాగంలో పరిమితంగా కనిపించిన కమల్ పాత్ర కూడా ఇందులో మరింత ప్రాధాన్యత పొందనుంది. అశ్వథ్థామ పాత్రపై ప్రత్యేక హైప్ తీసుకొచ్చేలా దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
మేకర్స్ ఇప్పటికే 30% షూటింగ్ పూర్తి చేయగా, మిగతా పార్ట్‌ను మరింత గ్రాండ్‌గా తెరకెక్కించనున్నారు. అశ్వథ్థామ, కల్కి (ప్రభాస్) మధ్య మేజర్ యాక్షన్ సీక్వెన్స్ లు ఉండేలా డిజైన్ చేస్తున్నట్లు టాక్. ముఖ్యంగా, అతని ఫైట్ సీన్స్ ప్రేక్షకులను షాక్‌కు గురిచేసేలా ఉంటాయని చెబుతున్నారు. కల్కి మొదటి భాగంలో చూపించిన విజువల్ ట్రీట్ ప్రేక్షకుల మైండ్ బ్లోయింగ్ అనుభవాన్ని ఇచ్చింది.
కానీ సీక్వెల్ మాత్రం అద్భుతమైన స్క్రీన్‌ప్లే, మాస్ ఎలిమెంట్స్‌తో మరింత గ్రాండ్‌గా ఉండబోతోంది. దీపికా (Deepika Padukone) పాత్ర కూడా ఈ పార్ట్‌లో కీలకంగా మారనుందని, ఆమె పాత్రకు అశ్వథ్థామ-కల్కి కలిసి మద్దతుగా నిలబడతారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం మేకర్స్ 2025 ద్వితీయార్థంలో ఈ చిత్రాన్ని విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. భారీ బడ్జెట్, ఇంటెన్స్ యాక్షన్ ఎపిసోడ్స్, సూపర్బ్ విజువల్స్ కలిగిన ఈ సినిమా, ఇండియన్ సినిమా రేంజ్‌ను మరోసారి పెంచే అవకాశం ఉంది.