ఈసారి కామెడీతో అలరించనున్న విజయ్ సేతుపతి..!

విజయ్ సేతుపతి ఇప్పటివరకు టాలీవుడ్ ప్రేక్షకులకు ‘సైరా’ లో సహాయ నటుడిగా, ‘మాస్టర్’ ‘ఉప్పెన’ లో విలన్ గా అలరించాడు. అతను తమిళ్ లో హీరోగా నటించిన పలు సినిమాలు తెలుగులో కూడా డబ్ అయ్యాయి కానీ.. అవి ప్రేక్షకుల్ని మెప్పించలేక పోయాయి. అయితే ఈసారి మాత్రం హీరోగా ఓ హిట్ అందుకునేలా కనిపిస్తున్నాడు. అతను హీరోగా నటించిన ‘కె.ఆర్.కె'(కన్మణి రాంబో. ఖటీజా) మూవీ ఏప్రిల్ 28న విడుదల కాబోతుంది.

Click Here To Watch NOW

ఈ మూవీలో విజయ్ సేతుపతికి జోడీగా నయనతార, సమంతలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.నయనతార బాయ్ ఫ్రెండ్ విగ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన సినిమా ఇది. ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. ‘ఖుషి’ స్టైల్ లో సమంత, నయన్ ఓ దీపాన్ని ఆరిపోకుండా అడ్డుకోవడానికి పరిగెత్తుకుని వస్తారు. వాళ్ళు అలా చేతులు దీపానికి అడ్డుపెట్టగా మరో మనిషి చేతులు కూడా కనిపిస్తాయి. అదే మన హీరో చేతులు. కట్ చేస్తే వీళ్ళని ఒకరికి తెలీకుండా ఇంకొకరిని ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం కూడా విజయ్ సేతుపతి చేసినట్టు చూపించారు.

ఇద్దరినీ ఫేస్ చేయడానికి ఇబ్బందులు పడే ప్రియుడుగా విజయ్ సేతుపతి నటన అలరించే విధంగానూ నవ్వించే విధంగానూ ఉంది.అనిరుథ్ సంగీతం కూడా ఆకట్టుకునే విధంగా ఉంది. ట్రైలర్ ఫన్నీ గా సాగింది. కాకపోతే ఈ మూవీ ‘ఆచార్య’ చిత్రానికి పోటీగా ఈ మూవీ విడుదల కాబోతుండడం బయ్యర్స్ ను కలవర పెట్టె అంశం.ఈ చిత్రానికి ప్రధాన బలం సమంత, నయన్ లకు తెలుగులో ఉన్న ఇమేజ్ మాత్రమే. సరే ఈ విషయాలను పక్కన పెట్టేసి ఈ ట్రైలర్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Share.