‘జబర్దస్త్’ కమెడియన్ వేణు ఎల్దిండి (Venu Yeldandi) దర్శకుడిగా మారి ‘బలగం’ (Balagam) అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. అది ఎంత మంచి సక్సెస్ అందుకుందో అందరికీ తెలుసు. రూ.4 కోట్ల బడ్జెట్లో తీసిన ఆ సినిమాకు భారీ లాభాలు వచ్చాయి. థియేట్రికల్ నుండి రూ.30 కోట్లు, ఓటీటీ నుండి రూ.12 కోట్లు, శాటిలైట్, డబ్బింగ్, ఆడియో వంటి వాటి రూపంలో నిర్మాతకి దాదాపు రూ.50 కోట్ల వరకు ప్రాఫిట్ వచ్చింది. కమర్షియల్స్ సంగతి ఎలా ఉన్నా..
కంటెంట్ పరంగా దర్శకుడు వేణుని డిస్టింక్షన్లో పాస్ చేశారు ప్రేక్షకులు. ‘జబర్దస్త్ లో స్కిట్స్ చేసుకునే వేణులో ఇంత టాలెంట్ ఉందా?’ అని అందరూ ఒకింత ఆశ్చర్యపోయేలా చేసింది ఆ సినిమా. అందుకే నిర్మాత దిల్ రాజు (Dil Raju) తన బ్యానర్లోనే నెక్స్ట్ సినిమా చేసుకోమని ఆఫర్ ఇచ్చాడు. ఈ క్రమంలో ‘ఎల్లమ్మ’ అనే కథ చెప్పడం.. అది కూడా ఓకే అయిపోవడం జరిగింది. మొదట నాని (Nani) , తేజ సజ్జ (Teja Sajja) ..లతో అనుకున్న ఈ సినిమా ఫైనల్ గా నితిన్ వద్దకు వెళ్ళింది.
దాదాపు రూ.40 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించబోతున్నారు దిల్ రాజు. హీరోయిన్ గా సాయి పల్లవిని (Sai Pallavi) అనుకున్నారు. కానీ ఆమె బిజీగా ఉండటం వల్ల ఈ సినిమాకి కాల్షీట్స్ సర్దుబాటు చేయలేనని చెప్పి తప్పుకుంది. దీంతో మేకర్స్ కీర్తి సురేష్ ని సంప్రదించారట. రూటెడ్ స్టోరీస్ కి సాయి పల్లవిని ఫస్ట్ ఆప్షన్ గా చూస్తారు టాలీవుడ్ మేకర్స్.
ఒకవేళ ఆమె నో చెబితే.. వెంటనే కీర్తి సురేష్ ను (Keerthy Suresh) సంప్రదిస్తారు. ఈసారి కూడా అదే జరిగింది. కీర్తి సానుకూలంగా స్పందించిందట. మరి ఆమె ఎంపికయ్యిందా? లేదా? అనేది త్వరలోనే చిత్ర బృందం నుండి అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి. గతంలో నితిన్ తో (Nithiin) ‘రంగ్ దే’ (Rang de) సినిమాలో కలిసి నటించింది కీర్తి సురేష్. ‘ఎల్లమ్మ’ లో కన్ఫర్మ్ అయితే.. రెండోసారి ఈ పెయిర్ రిపీట్ అయినట్టు అవుతుంది.