విశ్వక్ సేన్ (Vishwak Sen) నటించిన లేటెస్ట్ మూవీ ‘లైలా'(Laila) . రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని ‘షైన్ స్క్రీన్స్’ బ్యానర్ పై సాహు గారపాటి (Sahu Garapati) నిర్మించారు. ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే కానుకగా రిలీజ్ కాబోతుంది. ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన టీజర్,ట్రైలర్ పెద్దగా ఆడియన్స్ ని ఆకట్టుకోలేదు. అయితే విశ్వక్ సేన్ లేడీ గెటప్ వేయడం.. అతని స్టైల్లో డబుల్ మీనింగ్ డైలాగులతో సినిమాను ప్రమోట్ చేయడం, చిరంజీవి ప్రీ రిలీజ్ కి వచ్చి సినిమాను ప్రమోట్ చేయడం..
వీటన్నిటికీ మించి 30 ఇయర్స్ పృథ్వీ (Prudhvi Raj) కాంట్రోవర్సీ వంటివి సినిమాకి పబ్లిసిటీని తీసుకొచ్చాయి. దీంతో ఈ సినిమాకి బిజినెస్ సోసోగానే బిజినెస్ జరిగింది. ఒకసారి థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్ ను గమనిస్తే :
నైజాం | 2.50 cr |
సీడెడ్ | 1.00 cr |
ఆంధ్ర(టోటల్) | 2.50 cr |
ఏపీ + తెలంగాణ(టోటల్) | 6.00 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 1.50 cr |
వరల్డ్ వైడ్(టోటల్) | 7.50 cr |
‘మెకానిక్ రాకీ’ (Mechanic Rocky) చిత్రానికి రూ.7.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.8 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. విశ్వక్ సేన్ గత చిత్రం ‘మెకానిక్ రాకీ’ పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా.. బ్రేక్ ఈవెన్ కాలేదు. ‘లైలా’ కూడా అన్ సీజన్లోనే రిలీజ్ అవుతుంది.. కాబట్టి పాజిటివ్ టాక్ తెచ్చుకుంటేనే బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉంటుంది. లేదంటే కష్టమే..!