సందీప్ కిషన్(Sundeep Kishan) , రావు రమేష్ (Rao Ramesh) కాంబినేషన్లో వచ్చిన ‘మజాకా’ (Mazaka)మూవీ బాక్సాఫీస్ వద్ద తడబడుతుంది.’ధమాకా’ (Dhamaka) టాప్ లీగ్లో చేరిన త్రినాథ్ రావ్ నక్కిన (Trinadha Rao) దీనికి దర్శకుడు. ప్రసన్నకుమార్ బెజవాడ (Prasanna Kumar) కథ, స్క్రీన్ ప్లే అందించారు. ఫిబ్రవరి 26న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. మొదటి రోజు మిక్స్డ్ టాక్ వచ్చినా.. కొంతవరకు డీసెంట్ ఓపెనింగ్స్ ను సాధించింది. కానీ వీకెండ్ తర్వాత అంటే మొదటి సోమవారం కలెక్షన్స్ బాగా డ్రాప్ అయ్యాయి.
Mazaka Collections
బ్రేక్ ఈవెన్ టార్గెట్ పెద్దగా ఉంది కాబట్టి.. ఈ మాత్రం సరిపోవు అనే చెప్పాలి. ఒకసారి 6 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
‘మజాకా’ చిత్రానికి రూ.10.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.11 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 6 రోజుల్లో ఈ సినిమా రూ.4.68 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.6.32 కోట్ల షేర్ ను రాబట్టాలి. గ్రాస్ పరంగా రూ.8.72 కోట్లు రాబట్టింది.