“దేవర” (Devara) సినిమా రిలీజ్ అయినప్పటినుంచి ఎన్టీఆర్ (Jr NTR) అభిమానులు మరియు కొరటాల ఫాలోవర్స్ మూకుమ్మడిగా చిరంజీవిని టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. కొరటాల (Koratala Siva) పదే పదే చిరంజీవితో ఎలాంటి విభేదాలు లేవని చెప్పినప్పటికీ, చిరంజీవి (Chiranjeevi) “వాల్తేరు వీరయ్య” (Waltair Veerayya) ప్రమోషన్స్ టైమ్ లో కొరటాలను ఉద్దేశించి చేసిన నెగిటివ్ కామెంట్స్ మాత్రం భీభత్సంగా వైరల్ అయ్యాయి. అందుకే “దేవర” రిలీజ్ అయినప్పట్నుంచి అందరూ చిరంజీవి టార్గెట్ చేయడం మొదలెట్టారు. ఇప్పుడు.. ఈ లిస్ట్ లో లిరిక్ రైటర్ రామజోగయ్య శాస్త్రి (Ramajogayya Sastry) కూడా చేరడం చర్చనీయాంశం అయ్యింది.
Ramajogayya Sastry
“దేవర” రిజల్ట్ పై స్పందిస్తూ రామజోగయ్య శాస్త్రి “ఫ్రీడమ్ ఇస్తే ఇలాంటి సినిమాలొస్తాయి” అనే అర్థం వచ్చేలా ఆయన చేసిన కామెంట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. కానీ.. వెంటనే స్పందించిన రాంజో “నేను అన్నది కొరటాల టెక్నీషియన్స్ కు ఫ్రీడం ఇస్తారు అని, అంతే కానీ తప్పుడు అర్థాలు తీయవద్దు” అని క్లారిటీ ఇచ్చారు. అయితే.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది,
చిరంజీవి ఫ్యాన్స్ అందరూ రాంజోను ట్విట్టర్లో తిట్టిపోయగా, ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తూ ఆకాశానికెత్తేశారు. ఇక చేసేదేమీ లేక రాంజో సైలెంట్ గా ఉండిపోయాడు. ఇకపోతే.. రామజోగయ్య శాస్త్రి “దేవర”లో అన్నీ పాటలు రాసి సోలో టైటిల్ కార్డ్ దక్కించుకున్నారు. ముఖ్యంగా “చుట్టమల్లే & ఆయుధ పూజ” పాటల సాహిత్యానికి విశేషమైన పాజిటివ్ బజ్ వచ్చింది.
ఒక లిరిక్ రైటర్ కి తాము రాసిన పాటలకి మిలియన్ వ్యూస్ వస్తూ, ఆడియన్స్ ఎంజాయ్ చేయడం కంటే కావాల్సింది ఏముంటుంది. కాకపోతే.. ఈ ఆనంద సమయంలో సోషల్ మీడియాలో అనవసరంగా ట్రోల్ అవ్వడం మాత్రం బాధాకరం. కానీ ఏం చేస్తాం ఈ సోషల్ మీడియా యుగంలో ప్రశంసలతోపాటు ట్రోల్స్ ఫేస్ చేయడం అనేది తప్పదు.
ఓరి నాయనో
ఇది ఎటో దారితీస్తోన్నట్టుంది
నా ఉద్దేశ్యం శివగారు తన టెక్నీషియన్స్ కి
స్వేచ్ఛనిస్తారని..అంతే తప్ప మరొకటి కాదు
విపరీతార్ధాలు తీయవద్దని మనవి https://t.co/UPFfDcZxgT