ఆ విషయంలో నందమూరి హీరోలు తగ్గట్లేదుగా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. నందమూరి హీరోలైన బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ వరుస విజయాలను సొంతం చేసుకుంటూ కెరీర్ ను కొనసాగిస్తున్నారు. పటాస్ తర్వాత కళ్యాణ్ రామ్ ఆ స్థాయి బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకోలేకపోయినా ఈ హీరో విభిన్నమైన కథలను ఎంచుకుంటున్నారని నెటిజన్ల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. అయితే ప్రస్తుతం నందమూరి హీరోలు నటిస్తున్న సినిమాల విషయంలో, ఎంపిక చేసుకుంటున్న డైరెక్టర్ల విషయంలో అభిమానులు పూర్తిస్థాయి సంతృప్తితో ఉన్నారు.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గత ఏడేళ్లలో నటించిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈతరం హీరోలలో వరుస విజయాలతో డబుల్ హ్యాట్రిక్ సాధించిన హీరో ఎవరనే ప్రశ్నకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు సమాధానంగా వినిపిస్తోంది. ఎన్టీఆర్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లకు కొరటాల శివ, ప్రశాంత్ నీల్ డైరెక్టర్లుగా ఉన్నారు. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన జనతా గ్యారేజ్ సంచలన విజయం సాధించడంతో ఈ ప్రాజెక్ట్ విషయంలో ఫ్యాన్స్ సంతృప్తితో ఉన్నారు.

ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీపై ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుకాకముందే అంచనాలు పెరిగాయి. ప్రశాంత్ నీల్ తారక్ ను ఊరమాస్ రోల్ లో చూపిస్తున్నారు. నందమూరి నటసింహం బాలకృష్ణ సైతం వరుసగా గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి, బోయపాటి శ్రీను డైరెక్షన్ లో నటిస్తున్నారు. ఈ సినిమాలపై భారీస్థాయిలో అంచనాలు నెలకొన్నాయనే సంగతి తెలిసిందే.

బాలయ్య లైనప్ అద్భుతంగా ఉందని బాలయ్య వరుస విజయాలు సాధించడం ఖాయమని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న బింబిసార సినిమాపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. నందమూరి హీరోలు భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో కూడా సంచలన విజయాలను సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది. సినిమాసినిమాకు నందమూరి హీరోలకు మార్కెట్ పెరుగుతోంది.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Share.