సినిమాలు హిట్ అయ్యాక సదరు సినిమా దర్శకుడికి లేదా కథానాయకుడికి లేదా సంగీత దర్శకుడికి చిత్ర నిర్మాతలు ప్రత్యేకమైన బహుమతులు ఇవ్వడం అనేది భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీలో జరిగే విషయమే. అయితే.. జైలర్ సినిమా సక్సెస్ కి ఏకంగా.. హీరో, డైరెక్టర్ & మ్యూజిక్ డైరెక్టర్ కి కాస్ట్లీ కార్స్ గిఫ్ట్ గా ఇచ్చి చిన్నపాటి సెన్సేషన్ క్రియేట్ చేశాడు సన్ పిక్చర్స్ యజమాని కళానిధి మారన్.
Nani
తెలుగులోనూ అనిల్ రావిపూడి (Anil Ravipudi), వెంకీ కుడుముల (Venky Kudumula), కొరటాల శివ (Koratala Siva), కార్తీక్ దండు (Karthik Varma Dandu), రమేష్ వర్మ (Ramesh Varma) వంటి దర్శకులు తమ సినిమాలు హిట్ అయినప్పుడు మంచి బ్రాండ్ కార్లను బహుమతిగా అందుకున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో “కోర్ట్” (Court) సినిమా డైరెక్టర్ రామ్ జగదీష్ కూడా చేరాడు. నాని (Nani) నిర్మించిన కోర్ట్ తో మొదటి సినిమాతోనే 50 కోట్ల క్లబ్ లో చేరిన రామ్ జగదీశ్ కి నాని & ప్రశాంతి త్రిపిరనేని (Prashanti Tipirneni) కలిసి ఓ కొత్త కారు గిఫ్ట్ గా ఇచ్చారంట.
మాములుగా అయితే.. ఆ కారు డెలివరీ వీడియోలు కూడా రిలీజ్ చేసి ప్రమోట్ చేసుకుంటారు నిర్మాతలు. కానీ.. నాని మాత్రం కనీసం ఎక్కడా చెప్పొద్దు అన్నాడట. ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తప్పక చెప్పాల్సి వచ్చింది దర్శకుడు రామ్ జగదీశ్ కి ఈ విషయం. దాంతో నాని ఫ్యాన్స్ అందరూ అతడ్ని మెచ్చుకోవడం మొదలెట్టారు. చేసిన మంచి పనికి పబ్లిసిటీ చేసుకోకుండా ఉండడం నానికే చెల్లింది అని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇకపోతే.. నాని వచ్చేవారం “హిట్ 3″తో ఆడియన్స్ ను పలకరించనున్నాడు.