Hero Nani: ఆ మూవీ వల్లే తప్పు చేస్తున్న నాని!
- September 14, 2021 / 11:30 PM ISTByFilmy Focus
న్యాచురల్ స్టార్ నాని సినిమాకు హిట్ టాక్ వస్తే సులభంగా 40 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు వస్తాయి. అయితే వరుస ఫ్లాపులు నాని సినీ కెరీర్ పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. నాని సినిమాల ఫలితాలతో ఆయన అభిమానులు సైతం నిరాశ చెందుతున్నారు. కృష్ణార్జున యుద్ధం, దేవదాస్, గ్యాంగ్ లీడర్, వి, టక్ జగదీష్ సినిమాలతో వరుసగా ఐదు ఫ్లాపులు నాని ఖాతాలో చేరాయి. మాస్ ఇమేజ్ కోసం నాని తాపత్రయపడటం వల్లే ఈ ఫలితాలు ఎదురయ్యాయి.
ఒకప్పుడు భిన్నమైన కథలను ఎంచుకుని విజయాలను సొంతం చేసుకున్న నాని ప్రస్తుతం రొటీన్ కథలను, మూస కథలను ఎంచుకుంటూ ఫ్యాన్స్ ను నిరాశపరుస్తున్నారు. నాని మాస్ సినిమాల ద్వారా మంచిపేరును చెడగొట్టుకుంటూ ఉండటం గమనార్హం. ఎంసీఏ సినిమా రొటీన్ సినిమానే అయినా ఆ సినిమా ఘనవిజయం సాధించింది. అయితే ఆ సినిమా తరహా కథలను ఎంచుకుంటూ నాని పొరపాట్లు చేస్తున్నారు. నాని సినిమాలంటే కొత్తగా ఉంటాయని భావించిన ప్రేక్షకులు నాని చేస్తున్న తప్పుల వల్ల అతనికి దూరమయ్యే అవకాశం ఏర్పడుతోంది.

నాని ఇకపై కథల ఎంపిక విషయంలో జాగ్రత్త వహించాల్సి ఉంది. క్లాస్ సినిమాలతో గుర్తింపు పొందిన దర్శకుల డైరెక్షన్ లో నాని మాస్ సినిమాల్లో నటిస్తుండటం గమనార్హం. బ్యాగ్రౌండ్ లేకుండా ఎదిగిన నాని అంటే సుందరానికి, శ్యామ్ సింగరాయ్ సినిమాలతో సక్సెస్ ట్రాక్ లోకి వస్తారని నాని అభిమానులు ఆశిస్తున్నారు. నాని మూస కథలను ఎంచుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటారేమో చూడాల్సి ఉంది.
నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!
Most Recommended Video
టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!














