ప్రభాస్ ఫామ్ హౌస్‌కు చెందిన స్థలం పై కోర్టులో విచారణ నడుస్తున్న తెలిసిందే. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని రాయదుర్గంలో.. సర్వే నంబర్ 5/3 లోని 2083 చదరపు గజాల స్థలానికి సంబంధించి తీర్పు ఇచ్చే వరకూ స్థలాన్ని ఎవ్వరూ స్వాధీనం చేసుకోవడానికి వీలు లేదు. ప్రభాస్‌కు అప్పగించాల్సిన అవసరం లేదు.. అలాగని అక్కడ వున్న ఫామ్ హౌస్‌ని ధ్వంసం చేయకూడదు అంటూ స్టే ఇచ్చింది. ప్రభాస్ క్రింది కోర్టు నుండీ తెచ్చుకున్న ఇంజక్షన్ ఉత్తర్వుల్ని ఎత్తివేయాలంటూ.. తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన దరఖాస్తును వీలైనంత త్వరగా పరిష్కరించాలని కూడా కోర్టు ఆదేశించింది.
ఈ క్రమంలో ప్రధాన న్యాయమూర్తి ఆర్.ఎస్.చౌహాన్, జస్టీస్ పి. నవీన్‌రావులతో జరిగిన విచారణకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. రాయదుర్గంలోని సర్వే నంబర్ 5/3 లోని తన 2083 చదరపు గజాల స్థలాన్ని రెవెన్యూ అధికారులు బలవంతంగా స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నించారు అంటూ కూకట్‌పల్లి 15వ అదనపు జిల్లా జడ్జి వద్ద ప్రభాస్ కంప్లైంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తన ఫామ్ హౌస్ ను ముందుగ సీజ్ చేసి..
స్వాధీనం చేసుకోవాలి అని తెలంగాణ ప్రభుత్వం వారు ప్రయత్నించగా ప్రభాస్ లీగల్ గా పోరాడుతున్నాడు. అయితే ఇంకా స్పష్టమైన తీర్పు రాకుండా ప్రభాస్ ను ఇంకా టెన్షన్ పెట్టేలానే వ్యవహారం నడుస్తుంది. మరి ఈ సమస్య ఎప్పుడు తీరుతుంది.. ప్రభాస్ కు ఫేవర్ గా తీర్పు వస్తుందా అని అతని అభిమానులు సైతం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.