వెంకటేష్ (Venkatesh Daggubati) హీరోగా అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) సినిమా ఈ సంక్రాంతికి రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. 3 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించి భారీ వసూళ్ల దిశగా దూసుకుపోతుంది. ఈ సందర్భంగా టీం అంతా వెళ్లి మహేష్ బాబును (Mahesh Babu) కలిశారు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ (Seethamma Vakitlo Sirimalle Chettu) సినిమా టైం నుండి వెంకటేష్- మహేష్ నిజంగానే సొంత అన్నదమ్ములు మాదిరి కలిసుంటున్నారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాని మహేష్ బాబు దగ్గరుండి ప్రమోట్ చేశాడు.
Mahesh Babu
టీజర్ లాంచ్ చేయడమే కాకుండా సినిమా చూసిన వెంటనే ట్విట్టర్లో పాజిటివ్ ట్వీట్ వేసి.. మరింత పుష్ చేశాడు. దీంతో మహేష్ తో కలిసి ‘సంక్రాంతికి వస్తున్నాం’ సక్సెస్ సెలబ్రేట్ చేసుకోవాలని టీం డిసైడ్ అయ్యింది. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మహేష్ తో (Mahesh Babu) పాటు ‘సంక్రాంతికి వస్తున్నాం’ హీరో వెంకటేష్ అండ్ టీం ఈ ఫొటోల్లో కనిపిస్తున్నారు. అయితే ఈ ఫొటోల్లో దర్శకుడు వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) కూడా ఉండటాన్ని మహేష్ అభిమానులు గమనించారు.
దీంతో ‘ఈ పైడిపల్లి మహేష్ ని వదలడా?’ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మహేష్ బాబు 25వ సినిమా అయిన ‘మహర్షి’ ని (Maharshi) వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేశాడు. అది మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఇంకో సినిమా చేయాలని చూశాడు. కానీ ఎందుకో మహేష్.. వంశీ ప్రాజెక్టుని పక్కన పెట్టాడు. అయినప్పటికీ మహేష్ ని వంశీ వదలడం లేదు. లేటెస్ట్ ఫొటోలతో అతను మరోసారి హాట్ టాపిక్ అయ్యాడు వంశీ పైడిపల్లి