రాంచరణ్, అల్లు అర్జున్ .. ఓ మడత కాజా తింటూ దాని రుచిని ఆస్వాదిస్తున్న ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ ఫోటో వెనుక ఉన్న అసలు కథ ఏంటి? అంటే మనం 2009కి వెళ్ళాల్సిందే. అవి చిరంజీవి.. ‘ప్రజారాజ్యం’ పార్టీ పెట్టిన రోజులు. నిజానికి 2008 ఆగష్టు 20నే ‘ప్రజారాజ్యం’ పార్టీని పెడుతున్నట్టు అనౌన్స్ చేసారు. అయితే ఎన్నికలు 2009 సమ్మర్ లో జరుగాయి. ఇక ఆ పార్టీ ప్రచారంలో భాగంగా మెగాస్టార్ ఉభయగోదావరి జిల్లాలకు పర్యటన చేస్తున్న సమయంలో అల్లు అర్జున్, రాంచరణ్ కూడా ప్రచారానికి హాజరయ్యారు.
మధ్య స్టేషన్ లలో.. ఫ్యాన్స్ అభిమానంతో తాపేశ్వరం మడత కాజాల స్వీట్ ప్యాకెట్ ను ఇచ్చారట. ఇక జర్నీలో భాగంగా.. ట్రైన్ లో తీరిగ్గా కూర్చొని చరణ్,అర్జున్ లు తింటున్న సమయంలో తీసిన ఫోటో ఇదిని తెలుస్తుంది. అప్పటికే అల్లు అర్జున్ ‘గంగోత్రి’ ‘ఆర్య’ ‘బన్నీ’ ‘హ్యాపీ’ ‘దేశముదురు’ ‘పరుగు’ వంటి సినిమాలతో క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇక చరణ్ కూడా ‘చిరుత’ చిత్రంతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అయితే ఆ ఎన్నికల్లో ‘ప్రజారాజ్యం’ పార్టీ 18 సీట్లు మాత్రమే సాధించింది.
చిరంజీవి తన సొంత జిల్లా అయిన పశ్చిమ గోదావరిలోని పాలకొల్లు నుండీ పోటీ చేసారు. అయినప్పటికీ అక్కడ విజయం సాధించలేదు. అయితే తిరుపతి నుండీ మాత్రం పోటీ చేసి గెలుపొందారు. అయితే అదే ఏడాది కొన్ని కారణాల వల్ల ‘ప్రజారాజ్యం’ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసారు చిరు.