ప్రభాస్ ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా?
- June 7, 2017 / 10:31 AM ISTByFilmy Focus
గత ఐదేళ్లుగా ప్రభాస్ ఒకే లుక్ మెయింటైన్ చేశారు. కారణం బాహుబలి. ఆ చిత్రంలోని అమరేంద్ర బాహుబలిగా మెలితిప్పిన మీసంతో, పెరిగిన జుట్టుతో కనిపించారు. ఆ లుక్ అందరి మదిలో ముద్రపడిపోయింది. బాహుబలి కంక్లూజన్ పూర్తి అయిన తర్వాత లుక్ మార్చారు. జుట్టు కత్తిరించి, మీసాన్ని ట్రిమ్ చేశారు. ఈ లుక్ తోనే బాహుబలి ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం విశ్రాంతికోసం అమెరికా వెళ్లారు. అప్పటి నుంచి అతని ఫోటో ఒకటి కూడా బయటికి రాలేదు. మరో రెండు రోజుల్లో హైదరాబాద్ కి తిరిగిరానున్నారు. ఈ సమయంలో ప్రభాస్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇందులో మీసం, గడ్డం లేకుండా ప్రభాస్ కనిపిస్తున్నారు.
ఈ లుక్ ని చూసి అందరూ షాక్ తింటున్నారు. మీసం లేకుండా ప్రభాస్ ని చూడలేమని కొంతమంది విమర్శిస్తుంటే.. మరికొంతమంది మాత్రం బాలీవుడ్ హీరోలకు పోటీ ఇవ్వడానికి క్లీన్ షేవ్ చేసారని ఆనందపడుతున్నారు. ఈ లుక్ తోనే ప్రభాస్ సుజీత్ సినిమాలో నటిస్తారా? లేదా అనేది తెలియాల్సి ఉంది. యువీ క్రియేషన్స్ బ్యానర్లో వంశీ, ప్రమోద్ లు నిర్మిస్తున్న సాహో మూవీ రెగ్యులర్ షూటింగ్ వచ్చే వారంలో మొదలు కానుంది. అప్పుడు ప్రభాస్ లుక్ పై క్లారిటీ రానుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















