Pragya Jaiswal: బాలయ్యపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ప్రగ్యా జైస్వాల్!

స్టార్ హీరో బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అఖండ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. వచ్చే గురువారం థియేటర్లలో అఖండ మూవీ రిలీజ్ కానుంది. బోయపాటి శ్రీను ట్రైలర్ తో ఈ సినిమాపై భారీస్థాయిలో అంచనాలను పెంచగా సింహా, లెజెండ్ సినిమాలను మించి అఖండ మూవీ ఉంటుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. తాజాగా ప్రగ్యా జైస్వాల్ అఖండ ప్రమోషన్స్ లో భాగంగా బాలయ్యపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను బాలకృష్ణలాంటి పెద్ద హీరోతో ఇప్పటివరకు నటించలేదని ప్రగ్యా జైస్వాల్ అన్నారు.

బాలకృష్ణది టైమ్ అంటే టైమ్ అని గతంలో బాలయ్యను రెండుమూడు సార్లు కలిశానని ప్రగ్యా జైస్వాల్ చెప్పుకొచ్చారు. బాలయ్యతో పని చేస్తున్నానని తెలిసిన సమయంలో తొలిరోజు నెర్వస్ గా ఫీలయ్యానని అయితే బాలయ్యను కలిసిన ఐదు నిమిషాల్లో తాను కంఫర్ట్ గా ఫీలయ్యానని ప్రగ్యా జైస్వాల్ వెల్లడించారు. బాలకృష్ణలాంటి పాజిటివ్ పర్సన్ ను తాను చూడలేదని ప్రగ్యా జైస్వాల్ పేర్కొన్నారు. బాలయ్య నడిచి వస్తుంటే సెట్ అంతా సైలెంట్ అవుతుందని సమయపాలన, క్రమశిక్షణ విషయంలో బాలయ్య గ్రేట్ అని ప్రగ్యా జైస్వాల్ తెలిపారు.

అఖండ మూవీ రోల్ కోసం చాలా కష్టపడ్డానని ప్రగ్యా జైస్వాల్ అన్నారు. ఉదయం మూడు గంటలకు నిద్ర లేచి ఆరు గంటలకు బాలయ్య సెట్ కు వస్తారని రోజంతా షూటింగ్ లో పాల్గొంటారని మీరు మనిషేనా? అని బాలయ్యను అడిగానని ప్రగ్యా జైస్వాల్ చెప్పుకొచ్చారు. బాలయ్య పవర్ ఫుల్ వ్యక్తి కావడం వల్లే బోయపాటి శ్రీను అఖండ లాంటి పాత్రను రాసి ఉండవచ్చని ప్రగ్య పేర్కొన్నారు.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Share.