స్టార్ హీరోలతో వరుసగా బ్లాక్‌బస్టర్లను అందిస్తూ టాలీవుడ్‌లో డామినేట్ చేస్తున్న నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఇప్పుడు బాలీవుడ్ ఫోకస్‌లోకి వెళ్లింది. సన్నీ డియోల్ (Sunny Deol) ‘జాట్’ (Jaat) చిత్రాన్ని పీపుల్ మీడియాతో కలిసి నిర్మించారు. హిందీ మార్కెట్‌పై కన్నేసిన ఈ సంస్థ మరికొన్ని క్రేజీ ప్రాజెక్టు లను కూడా లైన్ లో పెడుతోంది. ఇక జాట్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మైత్రి నిర్మాత నవీన్ (Naveen Yerneni) ఆసక్తికర అంశాలను అభిమానులతో పంచుకున్నారు.
అసలు పుష్ప 3పై ఉంటుందా ఉండదా అనే గందరగోళానికి ఆయన ఓ స్పష్టత ఇచ్చారు. “పుష్ప 3 ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఇది ఇప్పుడే కాదు. 2027లోనే ప్రారంభమవుతుంది. అప్పటికి సుకుమార్ (Sukumar) – రామ్ చరణ్ (Ram Charan) సినిమా పూర్తవుతుంది. ఆ తర్వాతే పుష్ప 3 (Pushpa 3) సెట్స్ పైకి వెళ్తుంది,” అని పేర్కొన్నారు. అంటే పుష్ప (Pushpa) యూనివర్స్ మరోసారి తెరపైకి రావడం ఖాయమని ఆయన మాటల ద్వారా అర్థమవుతోంది.
ఇదిలా ఉండగా, అల్లు అర్జున్ కు (Allu Arjun) సంబంధించిన మరొక పెద్ద ప్రాజెక్ట్‌పై కూడా ఆయన పరోక్షంగా హింట్ ఇచ్చారు. అల్లు అర్జున్ – అట్లీ (Atlee Kumar) కాంబినేషన్ చిత్రం ఎప్పుడు అని మీడియా నుంచి ప్రశ్న ఎదురవగా.. “ఆ సినిమా మేము నిర్మించడం లేదు. కానీ త్వరలోనే అది మొదలవుతుంది. ఇంకా ప్రకటించలేను కానీ ప్రిపరేషన్ మొదలవుతుంది,” అని నవీన్ పేర్కొన్నారు. దీంతో ఈ కాంబోపై ఉన్న అంచనాలు రెట్టింపయ్యాయి.
అట్లీ దర్శకత్వంలో వచ్చిన గత సినిమాలన్నీ కమర్షియల్ గానే కాకుండా భారీ వసూళ్లను నమోదు చేసినవే. అల్లు అర్జున్ – అట్లీ కలయికలో వచ్చే చిత్రం కూడా అదే స్థాయిలో ఉండే అవకాశం కనిపిస్తోంది. సన్ పిక్చర్స్ మరియు గీతా ఆర్ట్స్ కలిసి ఈ సినిమాను నిర్మించనున్నట్టు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. కథ, కాస్టింగ్‌పై చర్చలు నడుస్తున్నాయని సమాచారం. త్రివిక్రమ్ ప్రాజెక్ట్ దశలవారీగా వెనక్కి వెళ్తుండటంతో, అట్లీ సినిమానే ముందుగా మొదలయ్యే ఛాన్స్ ఉంది.