Puri Jagannadh: గోపీచంద్ నుండి పిలుపు.. పూరీకి హీరో దొరికినట్టేనా?
- November 27, 2024 / 09:32 AM ISTByFilmy Focus
‘లైగర్’ (Liger) ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart) సినిమాలు దర్శకుడు పూరి జగన్నాథ్ (Puri Jagannadh)..ని రేసులో వెనక్కి నెట్టేశాయి. ‘ఇస్మార్ట్ శంకర్ ‘ (iSmart Shankar) తో బ్లాక్ బస్టర్ కొట్టి అప్పులన్నీ తీర్చేసిన పూరి జగన్నాథ్..ని మళ్ళీ అప్పుల్లోకి నెట్టేశాయి ‘లైగర్’ ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాలు. విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ‘జె జీఎం'(జన గణ మన) మధ్యలోనే ఆగిపోయింది. ముంబైలో ఆ సినిమాని చాలా గ్రాండ్ గా లాంచ్ చేశారు. కానీ ‘లైగర్’ రిజల్ట్ తర్వాత ఫైనాన్షియర్స్ డ్రాప్ అవ్వడంతో.. పూరి ఆ ప్రాజెక్టుని పక్కన పెట్టాడు.
Puri Jagannadh

మరోపక్క ‘డబుల్ ఇస్మార్ట్’ కి డిజాస్టర్ టాక్ వచ్చినా బిజినెస్ అయితే బాగానే జరిగింది. కానీ అవి ‘లైగర్’ నష్టాలు తీర్చడానికే సరిపోయాయి అని వినికిడి. పూరితో సినిమా చేయాలనే ఆశతో నిరంజన్ రెడ్డి.. ‘డబుల్ ఇస్మార్ట్’ థియేట్రికల్ రైట్స్ ని హోల్ సేల్ గా కొనేసి నష్టాలపాలయ్యారు. అందువల్ల పూరి.. నిరంజన్ రెడ్డికి సినిమా చేసి పెట్టి ఆదుకోవాలనే ఆలోచనలో పూరి ఉన్నట్టు తెలుస్తుంది.

కానీ హీరోలు సెట్ అవ్వడం లేదు. రవితేజ (Ravi Teja) కోసం పూరి కథ రెడీ చేసుకున్నాడు. ఇది పొలిటికల్ టచ్ ఉన్న యాక్షన్ మూవీ అని వినికిడి. కానీ రవితేజ కూడా ఇప్పుడు ప్లాపుల్లో ఉన్నాడు. అలాగే రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. సో ఇప్పట్లో రవితేజ… పూరీకి ఛాన్స్ ఇవ్వడం కష్టం. మరోపక్క నిరంజన్ రెడ్డి వద్ద తేజ సజ్జ (Teja Sajja) డేట్స్ ఉన్నాయి.

కానీ అతను కూడా ఇప్పుడు ఖాళీగా లేడు.పైగా తేజ సజ్జ ఇమేజ్ కి మ్యాచ్ అయ్యే కథ కూడా పూరీ వద్ద లేడు. దీంతో గోపీచంద్ ని (Gopichand) కలిసి కథ వినిపించాలని పూరీ భావిస్తున్నాడట. గోపి అయితే పూరీతో సినిమా చేయడానికి రెడీగానే ఉన్నాడు. చూడాలి మరి ఈ కాంబో అయినా సెట్ అవుతుందో లేదో!















