గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న విధంగానే గేమ్ ఛేంజర్ (Game Changer) మూవీ ఎట్టకేలకు వాయిదా పడింది. 2025 సంవత్సరం సంక్రాంతి పండుగ కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం జనవరి 10వ తేదీన ఈ సినిమా రిలీజయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే గేమ్ ఛేంజర్ వాయిదాతో పుష్ప ది రూల్ (Pushpa 2: The Rule) కలెక్షన్లకు ఢోకా లేనట్టేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. స్టార్ హీరో అల్లు అర్జున్ (Allu Arjun) నెత్తిన దిల్ రాజు (Dil Raju) పాలు పోశారని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.
Pushpa 2
డిసెంబర్ నెల 20వ తేదీన రాబిన్ హుడ్ (Robinhood) రిలీజ్ అవుతున్నప్పటికీ పుష్ప ది రూల్ సినిమాకు యునానిమస్ పాజిటివ్ టాక్ వస్తే ఇబ్బందేం ఉండదు. అటు పుష్ప2, ఇటు రాబిన్ హుడ్ మైత్రీ బ్యానర్ సినిమాలే కావడంతో ఈ రెండు సినిమాలకు థియేటర్ల విషయంలో సైతం ఇబ్బందులు రాకుండా మైత్రీ నిర్మాతలు జాగ్రత్తలు తీసుకోనున్నారు. పుష్ప ది రూల్ మూవీ స్క్రిప్ట్ విషయంలో సుకుమార్ (Sukumar) ప్రత్యేక శ్రద్ధ పెట్టారని ప్రేక్షకుల ఊహలకు అందని విధంగా ఈ సినిమా సాగుతుందని తెలుస్తోంది.
బన్నీ సైతం ఈ సినిమా రిజల్ట్ విషయంలో పూర్తిస్థాయిలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. పుష్ప ది రూల్ టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలలో ఒకటి కావడం గమనార్హం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు సైతం తమ బ్యానర్ లో నిర్మించే సినిమాల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. క్వాలిటీ ఔట్ పుట్ కు ఈ బ్యానర్ నిర్మాతలు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు.
పుష్ప ది రూల్ సినిమాకు భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పుష్ప ది రూల్ సినిమా సక్సెస్ సాధించడం దర్శకుడు సుకుమార్ కు సైతం కీలకమనే సంగతి తెలిసిందే. పుష్ప2 బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో మ్యాజిక్ చేస్తుందో చూడాల్సి ఉంది.