అల్లు అర్జున్(Allu Arjun) , సుకుమార్ (Sukumar)..ల ‘పుష్ప 2’ (Pushpa 2 The Rule)డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ నెల మొత్తం ఈ సినిమా హవానే నడిచింది. క్రిస్మస్ సెలవులు వరకు బాగా క్యాష్ చేసుకున్న ఈ సినిమా ఆ తర్వాత డ్రాప్ అయ్యింది. నార్త్ లో అయితే సంక్రాంతి ముగిసేవరకు బాగా రాణించింది.తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సెలవుల టైంలో 17 నిమిషాల ఫుటేజీని యాడ్ చేశారు. దాని వల్ల మరింతగా క్యాష్ చేసుకునే అవకాశం దొరికింది.
నార్త్ లో క్యాష్ చేసుకోవడానికి అది మరింతగా కలిసొచ్చింది. కానీ తెలుగు రాష్ట్రాల్లో ‘పుష్ప 2’ కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించలేదు. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 87.20 cr |
సీడెడ్ | 35.20 cr |
ఉత్తరాంధ్ర | 22.90 cr |
ఈస్ట్ | 11.50 cr |
వెస్ట్ | 9.12 cr |
కృష్ణా | 11.25 cr |
గుంటూరు | 13.30 cr |
నెల్లూరు | 7.00 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 197.47 cr |
కర్ణాటక | 41.00 cr |
తమిళనాడు | 13.30 cr |
కేరళ | 10.00 cr |
ఓవర్సీస్ | 103.60 cr |
నార్త్ | 334.85 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 700.22 cr (షేర్) |
‘పుష్ప 2’ చిత్రానికి రూ.600 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.605 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా రూ.700.22 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా ఈ సినిమా రూ.95.22 కోట్ల(కరెక్టెడ్) లాభాలు అందించింది. గ్రాస్ పరంగా 1360 కోట్లు కొల్లగొట్టింది.